మన శంకర వర ప్రసాద్: చిరు-వెంకీ కెమిస్ట్రీయే వేరే లెవల్
ఈ వేడుకలో చిరంజీవి - వెంకటేష్ ఒకే వేదికపై సందడి చేస్తుండటంతో అభిమానుల్లో చాలా కోలాహాలం నెలకొంది.ప్రస్తుతం మెగాఫ్యాన్స్ ఈ సినిమాలో హైలైట్స్ గురించి చాలా ముచ్చటిస్తున్నారు.;
మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఈ సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది కాబోతోంది. ఈ అరుదైన కాంబినేషన్‌లో వస్తున్న `మన శంకర వర ప్రసాద్ గారు` పండగ బరిలో బంపర్ హిట్ షోగా నిలవబోతోందా?.. అంటే.. నేటి సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ-రిలీజ్ వేడుకలో సందడి చూస్తుంటే, టీమ్‌లో ఆ కాన్ఫిడెన్స్, జోష్ చెబుతోంది. వేదిక ఎక్కకుండానే చిరు ఎదుట విక్టరీ వెంకటేష్ డ్యాన్సులతో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చారు. చిరు- వెంకీ ఓ చోటికి చేరితే ఆ సందడి ఎలా ఉంటుందో అభిమానులు సర్ ప్రైజింగ్‌గా లైవ్ లో వీక్షిస్తున్నారు.
ఈ వేడుకలో చిరంజీవి - వెంకటేష్ ఒకే వేదికపై సందడి చేస్తుండటంతో అభిమానుల్లో చాలా కోలాహాలం నెలకొంది.ప్రస్తుతం మెగాఫ్యాన్స్ ఈ సినిమాలో హైలైట్స్ గురించి చాలా ముచ్చటిస్తున్నారు. అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి హీరోగా నటించగా, నయనతార హీరోయిన్‌గా నటించారు. కేథరిన్ థ్రెసా కీలక పాత్రలో మెప్పించనుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక పవర్‌ఫుల్ ఎక్స్‌టెండెడ్ క్యామియో (సుమారు 45 నిమిషాల నిడివి)లో కనిపిస్తారు. ఆయన పాత్ర సినిమా ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చి, చిరంజీవికి అసిస్టెంట్‌గా లేదా బాడీగార్డ్‌గా కామెడీ యాక్షన్ కలబోతగా ఉంటుందని సమాచారం.
అలాగే మెగా విక్టరీ మాస్ సాంగ్ ఈ సినిమాకే ప్రధాన హైలైట్. చిరంజీవి -వెంకటేష్ కలిసి స్టెప్పులేసిన ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలం కానుంది. అలాగే ఈ సినిమా కథాంశం, చిరంజీవి పాత్ర కూడా ఆసక్తిని రేకెత్తించేవే. చిరంజీవి ఇందులో ఒక మాజీ RAW ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పాత్రలో కనిపిస్తారు. ఒక సాధారణ ఫ్యామిలీ మ్యాన్‌గా ఉంటూనే, అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లే ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ ఇది. ఇప్పటికే భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై హైప్ పెంచాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.