మెగా పవర్ స్టార్ 2026.. మొదట్లోనే టాప్ గేర్ మ్యాజిక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బిబిసి టాప్ గేర్ ఇండియా మ్యాగజైన్ కవర్ మీద మెరిశారు. 2026 సంవత్సరానికి సంబంధించి ఆ మ్యాగజైన్ రిలీజ్ చేసిన మొట్టమొదటి కవర్ పేజీ ఇదే కావడం విశేషం.;

Update: 2026-01-07 17:00 GMT

తెలుగు సినిమా స్టామినా ఇప్పుడు మామూలుగా లేదు. ఒకప్పుడు కేవలం మన సౌత్ కి మాత్రమే పరిమితమైన మన హీరోలు ఇప్పుడు గ్లోబల్ లెవల్ లో హాట్ టాపిక్ అవుతున్నారు. కేవలం సినిమాల కలెక్షన్లు మాత్రమే కాదు వారి లైఫ్ స్టైల్ అలాగే పర్సనల్ ఇంట్రెస్టులు కూడా ఇంటర్నేషనల్ లెవల్ లో అందరినీ ఆకర్షిస్తున్నాయి. 2026 మొదట్లోనే మెగా పవర్ స్టార్ అలాంటి ఒక క్రేజీ అచీవ్ మెంట్ తో వార్తల్లో నిలిచారు.

సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద మ్యాగజైన్ కవర్ల మీద హాలీవుడ్ స్టార్లను లేదా స్పోర్ట్స్ లెజెండ్స్ ని చూస్తుంటాం. కానీ మన తెలుగు సినిమా గ్లోరీ ఇప్పుడు ఆ హద్దులను చెరిపేసింది. ఒక ఆటోమొబైల్ అలాగే లైఫ్ స్టైల్ కి సంబంధించిన వరల్డ్ ఫేమస్ పత్రిక తన మొదటి సంచిక కోసమే మన హీరోని ఎంచుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అది మన సినిమా రేంజ్ ని ప్రపంచానికి చాటి చెప్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బిబిసి టాప్ గేర్ ఇండియా మ్యాగజైన్ కవర్ మీద మెరిశారు. 2026 సంవత్సరానికి సంబంధించి ఆ మ్యాగజైన్ రిలీజ్ చేసిన మొట్టమొదటి కవర్ పేజీ ఇదే కావడం విశేషం. రామ్ చరణ్ బాక్సాఫీస్ నుంచి పిట్ లేన్ వరకు అనే ట్యాగ్ లైన్ తో చరణ్ తన కొత్త అవతారాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.

ఆ ఫోటోలో చరణ్ ఒక నల్లటి ఆడి క్యూ8 కార్ దగ్గర నిలబడి చాలా కూల్ గా కనిపిస్తున్నారు. చేతిలో ఒక ఆరెంజ్ కలర్ జాకెట్ పట్టుకుని ఆయన ఇచ్చిన పోజు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ 2026 లో మనం కచ్చితంగా చూడాల్సిన 26 వెహికల్స్ గురించి ఆ మ్యాగజైన్ లో ఒక స్పెషల్ ఆర్టికల్ కూడా ఉంది. ఒక స్టార్ హీరోకి కార్ల మీద ఉన్న మక్కువని కూడా ఇందులో చక్కగా ప్రెజెంట్ చేశారు.

పెద్ది సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ టైమ్ లో చరణ్ ఇలా టాప్ గేర్ మోడ్ లో కనిపించడం ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తోంది. గ్లోబల్ లెవల్ లో చరణ్ ఇమేజ్ ఇప్పుడు నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిందని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక ఈ ఏడాది ఆయన బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News