మామి ఫిలింఫెస్టివల్ బోర్డ్ కొత్త సభ్యులకు రానా శుభాకాంక్షలు
టాలీవుడ్ సహా ముంబై పరిశ్రమతోనూ సత్సంబంధాలు కలిగి ఉన్న స్టార్ గా రానా దగ్గుబాటి సుపరిచితం. టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు వారసుడిగా అతడికి చాలా ముందునుంచే ఉత్తరాది స్టార్లతో దర్శకనిర్మాతలతో మంచి సంబంధాలున్నాయి. ఆ క్రమంలోనే అతడు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల వరుసగా మల్టీస్టారర్లలో నటించేందుకు అతడికి ఆస్కారం కలుగుతోంది. తనకు ఉన్న పరిచయాలతోనూ అతడి సినిమాలకు మార్కెట్ పెంచుకునే వ్యూహం తో రానా ముందుకు సాగుతున్నాడు.
తాజాగా రానా జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ బోర్డ్ లోకి కొత్తగా చేరిన ముగ్గురు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చైర్ పర్సన్ గా ఎంపిక కాగా.. రైటర్ కం ఫిలిం మేకర్ అంజలి మీనన్ .. ఫిలిం మేకర్ శివి దుంగర్పుర్ లు మామీ బోర్డ్ సభ్యులు గా చేరారు. తనకు సుపరిచితులైన వీరందరి చేరిక తనకు థ్రిల్ నిస్తోందంటూ రానా వ్యాఖ్యానించారు.
రానా నటించిన విరాటపర్వం త్వరలో విడుదల కానుంది. తదుపరి పవన్ తో కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ పైనా రానా పూర్తి దృష్టి సారించాడు. ఇందులో డేనియల్ అనే అహంకారి పాత్రలో రానా కనిపిస్తారు. ఇటీవల టైటిల్ పాత్రధారి పవన్ లుక్ ని రిలీజ్ చేశారు. తదుపరి రానా లుక్ ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.