బాక్సింగ్ రింగ్ లోకి బాహుబలి

Update: 2017-07-23 04:56 GMT
బాహుబలి.. బాహుబలి2 సినిమాలు సృష్టించలనాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇంకా చైనాలో సత్తా చాటడం ఒకటే బ్యాలెన్స్. అయితే.. బాహుబలి చరిత్ర మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ మూవీలోని ప్రధాన పాత్రలతో ఇప్పటికే పలు సీరియల్స్.. పుస్తకాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు బాహుబలి క్రీడల్లోకి కూడా వచ్చేస్తున్నాడు.

సూపర్ బాక్సింగ్ లీగ్ టోర్నమెంట్ సిద్ధమవుతోంది. ఇందుకోసం దక్షిణాదికి చెందిన ఓ టీమ్ కు బాహుబలి విలన్ భల్లాలదేవుడు సహ-యజమాని అయ్యాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టితో కలిసి బాక్సింగ్ జట్టును కొనుగోలు చేసిన దగ్గుబాటి రానా.. ఈ టీం కు 'బాహుబలి బాక్సర్స్' అని నామకరణం చేశారు. బాహుబలి ఫ్లేవర్ ను ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకోవడంతోనే తమ జట్టుకు ఇలాపేరు పెట్టినట్లు చెప్పాడు రానా. 'నాకు చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే మక్కువ. కానీ ఈ ఆటలు టీవీల్లో తప్ప లైవ్ లో చూసే అవకాశం రాలేదు. బాక్సింగ్ సూపర్ లీగ్ లో ఓ టీంతో భాగస్వామి అయ్యే అవకాశం వచ్చింది. మా టీంలో శోభు యార్లగడ్డ కూడా ఒకరు కావడంతో.. బాహుబలి బాక్సర్స్ అని నామకరణం చేశాం' అని చెప్పాడు రానా.

ఒక స్పోర్ట్స్ టీంకు రానా యజమానిగా మారడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ప్రోకబడ్డి లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు రానా. 'బాబాయ్ వెంకటేష్ లాగానే నాకు కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్పోర్ట్స్ తో కనెక్ట్ అయేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులకోలేను' అని చెప్పాడు రానా.


Tags:    

Similar News