అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడు
ఎప్పుడు బిజీ బిజీగా గడిపే స్టార్స్ కరోనా కారణంగా ఆరు ఏడు నెలల పాటు ఇంట్లో ఖాళీగానే కూర్చున్నారు. కొందరు అయితే ఏడాదిలో ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా కెమెరా ముందుకు వెళ్లలేదు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడ్డా కొన్ని రోజులకే షూటింగ్ లకు అనుమతులు ఇచ్చారు. అయితే కండీషన్స్ తో కూడిన అనుమతులు అవ్వడంతో పాటు చాలా మంది కరోనా భయంతో షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. ఇంకా షూటింగ్ లకు దూరంగా ఉండటంలో అర్థం ఉండదంటూ పలువరు యంగ్ స్టార్స్.. సీనియర్ లు కూడా మెల్లగా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు.
సీనియర్ హీరోలు వెంకీ.. నాగార్జున.. రవితేజ వంటి వారు షూటింగ్ లో జాయిన్ అయితే రానా వంటి యంగ్ స్టార్ట్స్ షూటింగ్ లకు దూరంగా ఉండటం పట్ల కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాబాయి వెంకీ 'నారప్ప'తో బిజీ అయినా రానా మాత్రం ఎందుకు ఇంకా షూటింగ్ లో జాయిన్ అవ్వడం లేదు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు రానా కూడా షూటింగ్ కు సిద్దం అయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఔట్ డోర్ షూటింగ్ కు వెళ్తున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. కార్లో ఔట్ డోర్ షూటింగ్ కు వెళ్తున్న పొటోలను షేర్ చేసిన రానా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. రానా ప్రస్తుతం విరాటపర్వం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆన్ లొకేషన్ నుండి రానా ఏమైనా అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.