భల్లాల దేవుడికి భార్య లేదా?

Update: 2016-03-21 09:10 GMT
బాహుబలి చిత్రంతో హీరో ప్రభాస్ కి ఎంత పేరొచ్చిందో.. విలన్ భల్లాలదేవుడిగా నటించిన దగ్గుబాటి కూడా అంతే ఫేమ్ సంపాదించుకున్నాడు. మరి బాహుబలి ది  బిగినింగ్ లో రాణాకి జోడీ కనిపించలేదు. అయితే.. భల్లాలదేవుడికి ఓ కొడుకు మాత్రం ఉన్నాడు. అడివి శేష్ ఈ పాత్రను చేయగా.. ఆ కేరక్టర్ ను శివుడు చంపేస్తాడు. అంటే భల్లాలదేవుడికి భార్య ఉంటుందనే విషయం స్పష్టమవుతుంది. మరి రెండో భాగమైన బాహుబలి ది కంక్లూజన్ లో భల్లాలకి భార్య రోల్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

రాణాకి జోడీగా నటిస్తోందంటూ లావణ్య త్రిపాఠి - శ్రియాశరణ్ ల పేర్లు వినిపించాయి. వాళ్లు ఈ విషయాన్ని ఖండించినా.. వేరే ఎవరో ఒకరు అయితే.. ఈ పాత్రలో కనిపిస్తారని అనుకున్నారు. కానీ రాణా వెర్షన్ చూస్తే.. ఆశ్చర్యం వేయక మానదు. 'భల్లాల దేవుడు రాజ్యం కోసమే రొమాన్స్ చేస్తాడు. వేరే ఎవరినీ ప్రేమించే సమయం ఆ కేరక్టర్ కి లేదు. అయినా.. ఇంకెవరినైనా తీసుకుంటే తెలియచేస్తాం కదా' అంటున్నాడు రాణా.

ఈ వెర్షన్ వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే భల్లాలదేవుడికి కొడుకు ఉంటాడు కానీ.. భార్య మాత్రం ఉండదన్న మాట. సర్లెండి.. జక్కన్న ఇంటెలిజెన్స్ ని అర్ధం చేసుకోవడం అంత ఈజీ కాదు కానీ.. ప్రస్తుతం ఈ పాత్ర కోసం మళ్లీ బరువు  పెరిగే పనిలో పడ్డాడు రాణా.
Tags:    

Similar News