మరో సీనియర్ నటికి బ్రేక్ ఇచ్చే పనిలో గురూజీ

Update: 2020-11-17 04:45 GMT
పంచులు, ప్రాసలతో సినిమాకు ఊపు తీసుకురావడం త్రివిక్రమ్​ శ్రీనివాస్​ స్టైల్​. కేవలం డైలాగులు, కథనంతోనే  సినిమాను నిలబెట్టడం ఆయనకే చెల్లింది. ఆయన దర్శకత్వం వహించగా బాక్సాఫీస్​ వద్ద బొల్తా కొట్టిన సినిమాల్లో సైతం డైలాగ్​లు హిట్​ అయ్యాయి. ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి.సమాజంలో జరిగే అన్యాయాలను తన మాటలతో వ్యంగంగా విమర్శిస్తుంటారు త్రివ్రిక్రమ్​. ఎలా బతకాలో.. ఎలా బతకొద్దో కూడా ఆ మాటలు మనకు నేర్పుతుంటాయి. ప్రస్తుతం త్రివ్రిక్రమ్​ జూనియర్​ ఎన్టీఆర్​తో ఓ సినిమాను తీయబోతున్నారు.

 ఆర్ఆర్ఆర్ సినిమా కంప్లీట్ అయ్యాక   ఎన్టీఆర్ ఈ సినిమాకు డేట్స్ ఇవ్వనున్నారు. వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన ‘అరవిందసమేత’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నది. ప్రస్తుతం తారక్​తో పొలిటికల్​ టచ్​ ఉండే సినిమాను తెరకెక్కించనున్నట్టు టాక్​ ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్​ను పరిశీలిస్తున్నారట.  త్రివిక్రమ్​ క్రియేట్​ చేసిన పాత్రలకు కూడా సరిగ్గా సూటయ్యే నటులను ఎంపికచేస్తుంటారు. అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అల వైకుంఠపురములో టబును పెట్టి ఎంతో చక్కని డ్రామాను నడిపించారు.

అత్తారింటికి దారేది చిత్రం నదియాకు మంచిపేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆ ఇమేజ్ తో ఆమె పలు సినిమాల్లో నటించింది.  తారక్ తో చేయబోయే సినిమాలోనూ ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణను తీసుకొస్తున్నట్టు టాక్​. బాహుబలి చిత్రంలో శివగామిగా నటించి రమ్యకృష్ణ ఎంతోపేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో అత్త పాత్రల్లో నటించినప్పటికి.. పెద్దగా పేరు రాలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్​లో ఓ పవర్​ఫుల్​ పొలిటికల్​ లీడర్​ పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్​ అందించే మాటలు ఈ సినిమాకు, రమ్యకృష్ణ పాత్రకు హెల్ప్​ కానున్నాయి.
Tags:    

Similar News