• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో యంగ్ డైరెక్టర్ కి...

మరో యంగ్ డైరెక్టర్ కి చరణ్ గ్రీన్ సిగ్నల్!

By - Tupaki Desk
Update: 2022-01-11 08:30 GMT
స్టార్ హీరోలంతా ఒక సినిమా తరువాత మరో సినిమాను లైన్లో పెడుతుంటారు. ఏ సినిమా సెట్స్ పై ఉంటే ఆ సినిమాపైనే పూర్తి ఫోకస్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అయితే నిన్నమొన్నటివరకూ చరణ్ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతూ వచ్చాడు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించిన ఆయన. తన వైపు నుంచి ఆడియన్స్ తో గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతోనే 'ఆచార్య' చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా విడుదలకి రెడీగా ఉన్నాయి. కరోనా తీవ్రంగా ఉండటం వలన, సరైన రిలీజ్ సమయం కోసం వెయిట్ చేస్తున్నాయి.

చరణ్ సినిమాల కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరో వైపున ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. శంకర్ దర్శకత్వంలో ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ షూటింగును ఆయన పూర్తి చేశాడు. ఆ తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. 'జెర్సీ' సినిమాతో దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి తానేమిటనేది నిరూపించుకున్నాడు. ఇదే సినిమాను ఆయన హిందీలో రీమేక్ చేశాడు. ఆ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. గౌతమ్ టేకింగ్ నచ్చడం .. ఆ తరువాత ఆయన చెప్పిన కథ నచ్చడంతో చరణ్ ఓకే చెప్పేశాడు. త్వరలోనే ఈ సినిమాను రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఇక ఈ నేపథ్యంలోనే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలోను చరణ్ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. 'టాక్సీవాలా' సినిమాతో హిట్ కొట్టిన రాహుల్, ఇటీవల 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. నాని కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా, ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా కథా నేపథ్యం .. పాత్రలను ఆయన మలిచిన తీరుకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాను హ్యాండిల్ చేసిన తీరుకు రాహుల్ కి ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి.

చరణ్ కూడా ఈ సినిమాను చూసి రాహుల్ ను అభినందించాడు. రాహుల్ పనితీరును మెచ్చుకున్న ఆయన తన కోసం మంచి కథను రెడీ చేయమని చెప్పాడట. ప్రస్తుతం రాహుల్ అదే పనిలో ఉన్నాడని అంటున్నారు. దాదాపుగా ఈ కాంబినేషన్ ఖాయమైనట్టేననే టాక్ వినిపిస్తోంది. ఇక ఇటీవలే రాహుల్ మాట్లాడుతూ .. తాను టైమ్ ట్రావెల్ కి సంబంధించిన ఒక కథను రెడీ చేస్తున్నట్టుగా చెప్పాడు. బహుశా ఆ కథను చరణ్ కి సెట్ చేస్తాడేమో చూడాలి. ఇక తాజాగా 'రౌడీ బాయ్స్' ఈవెంట్ లో బన్నీ కూడా 'శ్యామ్ సింగ రాయ్' డైరెక్టర్ ను పొగిడేశాడు. ఆయన కూడా ఈ డైరెక్టర్ పట్ల ఆసక్తిని చూపుతున్నాడనే విషయం అర్థమవుతోంది. చూడాలి మరి .. ఏం జరుగుతుందో!      
Tags:    
  • rc15 
  • Ramcharan movies 
  • ramcharan pan indian movies 
  • Shyam Singha Roy 
  • rahul sankrityan 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS