ఎనర్జిటిక్ స్టార్ రామ్ వరస పరాజయాలతో సతమతవుతున్న సమయంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపంలో ఒక బ్లాక్ బస్టర్ తగిలింది. కెరీర్ బెస్ట్ కలెక్షన్లతో ఒక్కసారిగా రామ్ మళ్ళీ మిడ్ రేంజ్ హీరోలలో తన సత్తా ఏంటో చాటాడు. అందుకే ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా 'రెడ్' ను ఆచితూచి ఎంపిక చేసుకున్నాడు. మరి ఈ సినిమా 'ఇస్మార్ట్ శంకర్' ఫీట్ ను రిపీట్ చెయ్యగలుగుతుందా?
ఈ సినిమాను సమ్మర్ సీజన్లో రిలీజ్ చేస్తామని లాంచ్ కార్యక్రమంరోజే ప్రకటించారు. దీంతో అందరికంటే ముందే సమ్మర్ సీజన్ పై రామ్ కన్నేసిన విషయం స్పష్టంఅవుతోంది. అయితే సమ్మర్ సీజన్లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ కూడా ఉంటుంది. మరి ఆ పోటీని తట్టుకోవాలంటే సినిమా సూపర్ గా ఉండాల్సిందే. రామ్ ఫ్లాపుల్లో ఉన్న సమయంలో 'నేను శైలజ' లాంటి మంచి హిట్ అందించిన కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. 'నేను శైలజ' సూపర్ హిట్ అయినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఉన్నది ఒకటే జిందగీ' నిరాశపరిచింది. ఈ కాంబినేషన్లో 'రెడ్' మూడవ చిత్రం.
తమిళ హిట్ సినిమా 'తడం' కు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్ సినిమాలో హీరో అరుణ్ విజయ్. హీరో డబల్ రోల్ లో నటించిన ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్. మాస్ ఆడియన్స్ కు నచ్చేలా ఉంటుంది. అంతా బాగానే ఉంది కానీ దర్శకుడు కిషోర్ తిరుమల స్టైల్ సాఫ్ట్ సినిమాలకు లవ్ స్టొరీలకు సూట్ అవుతుంది కానీ ఇలాంటి మాస్ టచ్ ఉండే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఆయన ఎంతమాత్రం న్యాయం చెయ్యగలడు అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు. పైగా తమిళ సినిమానుంచి సోల్ మాత్రమే తీసుకుని మార్పులు చేర్పులు చేశామని అంటున్నారు. అది కూడా ఎంతమాత్రం కనెక్ట్ అవుతుందో చూడాలి.