• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాఫీ తాగుతూ కన్నుగీటిన...

కాఫీ తాగుతూ కన్నుగీటిన ఎనర్జిటిక్ హీరో.. పిక్ వైరల్!

By - Tupaki Desk
Update: 2021-06-01 10:30 GMT
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ప్రస్తుతం తదుపరి మూవీస్ విషయంలో స్పీడ్ పెంచాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. బాక్సాఫీస్ దగ్గర రెడ్ మూవీ మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. యాభైశాతం అక్యూపెన్సీ సమయంలో రెడ్ సినిమా విడుదలైంది. ఇప్పటివరకు రామ్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. ఆ సినిమా దాదాపు 40కోట్ల షేర్ రాబట్టగా.. రెడ్ అంతలా రాబట్టలేకపోయింది. ఇస్మార్ట్ శంకర్ నుండి ఈ ఉస్తాద్ హీరో తన క్రేజ్ మెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు.

కానీ తాజాగా తదుపరి సినిమా తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ప్రకటించి సర్ప్రైజ్ చేసాడు. పందెంకోడి, ఆవారా సినిమాలతో ఆకట్టుకున్న లింగుస్వామి ప్రస్తుతం ప్లాప్ లలో ఉన్నాడు. వీరి కాంబినేషన్ మూవీ బైలింగువల్ సినిమాగా తెలుగు, తమిళంలో తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమా రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు టాక్ నడుస్తుంది. రామ్ లింగుస్వామి సినిమా విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నాడట. అందుకే సినిమా ఫిక్స్ అయినప్పటి నుండే షూట్ ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నాడట. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మాస్ అంశాలతో తెరకెక్కనున్న ఈ మూవీతో రామ్.. మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని తెగట్రై చేస్తున్నాడు. ఇండస్ట్రీలో కొంతకాలంగా రామ్ కమర్షియల్ హీరోగా సెటిల్ అవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అందుకే ఇస్మార్ట్ శంకర్ నుండి మాస్ కథలకోసమే ఎదురుచూసి లింగుస్వామి కథను ఓకే చేసాడు. ప్రస్తుతం లింగుస్వామి సినిమా కోసం తనను తను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ కృతిశెట్టి కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాను సీటిమార్ ఫేమ్ శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నాడు. అయితే రామ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు న్యూ ఫోటోస్ పోస్ట్ చేస్తుంటాడు. ఆ విధంగానే తాజాగా కాఫీ తాగుతూ దిగిన పిక్ పోస్ట్ చేసాడు. బిటర్ కాఫీ కంటే తియ్యనిది ఏది లేదంటూ కాప్షన్ జోడించాడు. చెదిరిన హెయిర్ స్టైల్ తో రామ్ కన్ను గీటిన పిక్ చూస్తూ లేడీ ఫ్యాన్స్ అలా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
Tags:    
  • Ram Pothineni 
  • Ram Pothineni Latest Picsr 
  • Tollywood 
  • Telugu News 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS