రాంగోపాల్ వర్మ ‘మద్యం’ ఉద్యమం?
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును అని నాటి పాత గిరీషం అన్నాడు. కానీ ఇప్పుడు మందు తాగని వాడు కూడా దున్నపోతై పుడుతాడు అంటున్నాడు మన ఆధునిక గిరీషం ‘రాంగోపాల్ వర్మ’. ఈ వివాదాల దర్శకుడు ఇప్పుడు చేస్తున్న ట్వీట్లు చూస్తుంటే మొత్తం ‘మద్యం’ గురించే. ఆఖరుకు ఉగ్గ బట్టలేక మంత్రి కేటీఆర్ ను వైన్ షాపులు తెరిపించండి ప్లీజ్ అని వేడుకున్నాడు. వర్మ ట్వీట్ కు ‘సెలూన్’కు లింకు పెట్టి కేటీఆర్ వాయిదా వేశారు.
ఇక కేసీఆర్ సైతం ప్రెస్ మీట్ లో ఒక పెగ్గు మందు తాగాలన్నది తన చిరకాల కోరిక అని వర్మ అన్నాడు. మందుబాబులకు ఇర్ష్య పుట్టేలా కేసీఆర్ మందు తాగాలని ఈ మధ్య ఇంటర్వ్యూలో వర్మ చెప్పుకొచ్చాడు. ఇక మందు లేక ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి రోగుల సంఖ్య పెరుగుతుందని బెంగాల్ లో వలే తెలంగాణలోనే మద్యం షాపులు తెరవాలని వేడుకుంటున్నాడు. మందులేక ఇంట్లో గొడవలు అవుతున్నాయని.. పిచ్చోళ్లు అయిపోతున్నారని వివాదాల వర్మ తెగ బాధపడిపోతున్నాడు.
అయితే ఇలాంటి కరోనా టైంలో మందుకు బార్ల తెరిస్తే సోషల్ డిస్టేన్స్ గంగలో కలిసి కరోనా వ్యాపించడం ఖాయం. ఇక కేసీఆర్ ఇచ్చిన 1500 కూడా పేదలు తాగుడికే ఖర్చు చేస్తారు. పేదల పరిస్థితి దృష్ట్యానే ఇలాంటి సమయంలో మద్యం షాపులు తెరవొద్దని ప్రభుత్వాలు నిర్ణయించేశాయి.
అయితే వర్మ మాత్రం తాగలేకుండా ఉండలేకపోతున్నట్టున్నాడు. లాక్ డౌన్ తో బంద్ అయిన మద్యాన్ని తలుచుకుంటూ గుక్కతిప్పుకోకుండా మందు బాబోయ్ అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. నెటిజన్లు మాత్రం ఎవ్వరూ వర్మ ‘మద్యం’ ఉద్యమానికి సపోర్టుగా నిలవడం లేదు. అయితే మందుబాబులకు మాత్రం వర్మ నాయకత్వం తెగ నచ్చేసింది. ఆయనకు సపోర్టుగా నిలుస్తున్నారు. ప్రభుత్వాలు ఒకవేళ మద్యానికి బార్లు తెరిస్తే ఆ క్రెడిట్ కూడా వర్మకే దక్కుతుందేమో చూడాలి.