వర్మ విడాకులకు కారణం అవే
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆసక్తి కలిగించడం, పర్సనల్ విషయాలను కూడా నిర్భయంగా పబ్లిక్ గా షేర్ చేసుకోవడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిట్ట. ఇప్పుడు తన విడాకులకు కారణం ఘజల్స్ అంటూ చెప్పి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అది కూడా ప్రముఖ ఘజల్ గాయకుడు ఘజల్ శ్రీనివాస్ ఎదురుగా ఈ మాట చెప్పడం ఆసక్తికరం.
మంచు మనోజ్ - రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో రూపొందిన ఎటాక్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో ఘజల్ శ్రీనివాస్ తో ఓ పాట పాడించారు. ఆవేశపూరితంగా సాగే ఈ పాట బాగానే క్లిక్ అయింది. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో వర్మ తన విడాకులకు కారణంగా చెప్పాడు. 'నిజానికి నా విడాకులకు కారణాల్లో ప్రధానమైనవి ఘజల్స్. నాకు అవి ఇష్టం ఉండవు. కానీ నా భార్యకు ఘజల్స్ చాలా ఇష్టం. నేను ఇళయరాజా పాటలు ఇష్టపడతాను' అన్నాడు వర్మ.
'రాత్రిపూట తను ఘజల్స్ ప్లే చేసేది. నేను నాకిష్టమైన పాటలు వినాలని అనుకునేవాడిని. అదే మా విడాకులకు కారణం. అయితే.. ఘజల్ శ్రీనివాస్ ను కలిశాక ఘజల్స్ నాకిష్టం ఉండవు అనే అభిప్రాయం మార్చుకున్నాను' అని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. మంచు మనోజ్ - సురభి జంటగా నటించిన ఎటాక్.. ఏప్రిల్ 1న విడుదల కానుంది. జగపతిబాబు - ప్రకాష్ రాజ్ - వడ్డే నవీన్ - పూనమ్ కౌర్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.