వరుణ్ ని అలానే పిలవాలంటున్న రామూ..

Update: 2015-12-18 06:06 GMT
శిష్యుడు పూరి తెరకెక్కించిన లోఫర్ సినిమా ఓ కళాఖండం అంటూ రామూ తెగ ట్వీటుతున్నాడు. ముఖ్యంగా వరుణ్ ని టార్గెట్ చేసుకుని పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. అయితే రామూ ఏం చేసినా అది అతిశయానికి సాయం చేసినట్టు వుంటుంది గాబట్టి ఈ పొగడ్తలు కూడా కాస్త శృతిమించాయి.

వరుణ్ నటన, వేరియేషన్ చూస్తుంటే చూస్తుంటే తదుపరి మెగా స్టార్ ఇతనేనంటూ వరుణ్ కి ఒమేగా స్టార్ అనే బిరుదుని ప్రకటించానంటూ రాసుకొచ్చాడు. ఒమెగా స్టార్ ఏ ఎందుకంటే ఒమెగా కంటే పెద్ద కొలమానం లేదని స్పష్టం చేశాడు.

ఇంతవరకూ బాగానే వుంది గానీ ఈ సినిమాకు వినిపిస్తున్న నెగిటివ్ కామెంట్లు రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్ప్రెడ్ చేస్తున్నవే అంటూ తనదైన పైత్యం చూపించాడు. మన వాడిని పొగడాలంటే పక్కవాడని తిట్టాలని రామూ డిసైడ్ అయిపోయాడన్నమాట.   
Tags:    

Similar News