స్టార్ గా పవన్ అంటే ఇష్టం లేదు

Update: 2015-11-26 11:38 GMT
నేను చిరంజీవి వీరాభిమానిని.. అందుకే మెగాస్టార్ సినిమా అంటే రాజమౌళికి పది రెట్లు ఉండాలని కోరుకుంటా.. అదీ రామ్ గోపాల్ వర్మ గతంలో ఇచ్చిన స్టేట్ మెంట్. ఇలా వర్మ చెప్పినా.. చిరు ఫ్యాన్స్ నమ్మింది చాలా తక్కువ. ఇప్పుడు రిలీజ్ కానున్న కిల్లింగ్ వీరప్పన్ కోసం.. మెగా ఫ్యాన్స్ ని దువ్వడానికే ఇదంతా అని చాలామంది అనుకున్నారు.

అయితే.. ఓ ఇంటర్వ్యూలో మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ చెప్పాడు వర్మ. ఈసారి చిరు కంటే.. పవన్ కళ్యాణ్ మీద పడ్డ పంచ్ లు ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంటే వర్మకి చాలా ఇష్టమంట. కాకపోతే ఇది వ్యక్తికి - వ్యక్తిత్వానికి మాత్రమే పరిమితం అంటున్నాడు. అంతే కాదు జనసేన లాంఛ్ చేసినపుడు.. పవన్ ఇచ్చిన స్పీచ్ అదుర్స్ అంటున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ రాసిన పవనిజం పుస్తకం మాత్రం వేస్ట్ అని తేల్చేశాడు. ఒక మనిషిగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమంటున్న వర్మ.. పవర్ స్టార్ గా మాత్రం ఆయన నచ్చలేదంట. అసలు పవన్ కళ్యాణ్ మూవీల్లో కొమరం పులి తప్ప మరే సినిమానీ చూడలేదట. అదే అన్నయ్య చిరంజీవి విషయానికొస్తే.. మెగాస్టార్ గా చిరంజీవి అంటే చాలా ఇష్టమే అంటున్నాడు వర్మ. కానీ వ్యక్తిగా మాత్రం చిరు అంటే పడదంటున్నాడు.

ఒక స్టార్ గా మాత్రం ఎనలేని అభిమానం అని చెప్పడమే కాదు.. ఆయన నటించిన మొత్తం 150  సినిమాలను బ్రూస్ లీతో సహా చూశానన్నాడు. చిరంజీవి సినిమాలను లైన్ లో నుంచుని టికెట్స్ కొన్నానని, బ్లాక్ లో టికెట్స్ కొనేందుకు ఎగబడ్డానని చెప్పాడు వర్మ. ఏమైనా.. స్టేట్ మెంట్ ని ఇంట్రెస్టింగ్ చెప్పడంలో వర్మ బాగా ఇంటెలిజెంట్ అనిపిస్తోంది కదూ.
Tags:    

Similar News