ఒక‌వేళ డార్లింగ్ ల‌వ్ ఫెయిల్యూర్ కాదు క‌దా!

ఇదంతా ప‌క్క‌న‌బెడితే అస‌లు ప్ర‌భాస్ ఎందుకు పెళ్లి చేసుకోవ‌డం లేదు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా హైలైట్ అవ్వ‌లేదు.

Update: 2024-05-06 03:00 GMT

బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్...టాలీవుడ్ లో ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా? అనే రోజుల నుంచి ఇక చేసుకోరేమో! అనే వర‌కూ స‌న్నివేశం వ‌చ్చేసింది. గ‌త ఏడాది వ‌ర‌కూ డార్లింగ్ పెళ్లిపై నెట్టింట ఏదో వార్త వినిపించేదిగానీ ఇప్పుడు ఆ త‌ర‌హా ప్ర‌చారం ఆస‌క్తిగానూ అనిపించ‌లేదు. అయితే అవుతుంది..లేక‌పోతే లేదు. ఆ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చూసుకుందాం లే అనే వ‌ర‌కూ వ‌చ్చేసారంతా. ఇదంతా ప‌క్క‌న‌బెడితే అస‌లు ప్ర‌భాస్ ఎందుకు పెళ్లి చేసుకోవ‌డం లేదు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా హైలైట్ అవ్వ‌లేదు.

చేసుకోవ‌డం లేద‌నే అన్నారు త‌ప్ప ! ఏ కార‌ణంగా చేసుకోవ‌డం లేదు అన్న‌ది ఎవ‌రూ ఫోకస్ చేయ‌లేదు. ఒక‌వేళ ల‌వ్ ఫెయిల్యూర్ గ‌ట్టా ఎదురైందా? జీవితంలో ఎప్పుడైనా అని ఆలోచించారా? అవును ఈ సందేహం క‌లిగేలా చేసింది డార్లింగ్ ప్ర‌భాస్. ఆయ‌న మాట తీరు అలాగే ఉంది మ‌రి. డార్లింగ్ ఖాళీగా ఉంటే ఏం చేస్తారో తెలుసా...లవ్ స్టోరీలే ఇంట్లో కూర్చుని చూస్తారుట‌. ఒక ల‌వ్ స్టోరీ కాదు. బాగా న‌చ్చితే అదే సినిమా ఎన్నిసార్లైనా చూస్తారుట‌. తాను యాక్ష‌న్ సినిమాలు ఎక్కువ‌గా చేస్తున్నా అంత‌కు మంచి ల‌వ్ స్టోరీలు అంటే ఎక్కువ ఆస‌క్తి అట‌.

Read more!

అలాంటి క‌థ‌నాలు చ‌ద‌వ‌డానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారుట‌. మ‌రి ల‌వ్ విష‌యంలో ఇంత ఆస‌క్తి చూపించే డార్లింగ్ ఎప్పుడైనా రియ‌ల్ లైఫ్ లో ప్రేమ‌లో ప‌డ్డాడా? అన్న‌ది మాత్రం స‌స్పెన్స్. ఈ విష‌యం గురించి చాలాసార్లు అడిగినా ఓపెన్ అవ్వ‌లేదు. చివ‌రికి స్నేహితుల ద్వారానైనా చెప్పించాల‌ని బాల‌య్య చాలా ట్రై చేసారు. అయినా ప‌న‌వ్వ‌లేదు. సినిమాలో పాత్ర‌ల‌తో ల‌వ్ లో ప‌డ్డాడు త‌ప్ప రియ‌ల్ లైఫ్ లో అలాంటివి ఏమి లేవ‌ని స్కిప్ చేసాడు. మరి అది నిజ‌మో? కాదో!

ఇక డార్లింగ్ సినిమాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడిగా పుల్ బిజీగా ఉన్నాడు. స‌లార్ -2 తో పాటు రాజాసాబ్ లోనూ న‌టిస్తున్నాడు. ఆ రెండు పూర్తికాగానే హ‌ను రాఘ‌వ‌పూడి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడు. అంత‌కంట ముందు సందీప్ రెడ్డి వంగ‌తో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స్పిరిట్ చేస్తారు. ఈ సినిమా కోసం ఇండియా అంతా వెయిట్ చేస్తోంది.

Tags:    

Similar News