ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి విడాకులు!

హాలీవుడ్ పాప్ సింగ్ బ్రిట్నీ స్పియ‌ర్ ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి విడాకులు తీసుకుంది

Update: 2024-05-06 00:30 GMT

హాలీవుడ్ పాప్ సింగ్ బ్రిట్నీ స్పియ‌ర్ ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి విడాకులు తీసుకుంది. సామ్ అస్గారితో అధికారికంగా విడిపోయారు. ఇద్ద‌రు విడిపోయిన ఎనిమిది నెల‌లు త‌ర్వాత విడాకులు మంజూరయ్యాయి. పెళ్లైన అయిన రెండేళ్ల‌గా ఈ బంధం వీగిపోయింది. ఇద్ద‌రూ గ‌త ఏడాది జులై లోనే విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆగ‌స్టులో విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌గా తాజాగా కోర్టు విడాకులు మంజూరు చేసింది. వివాహానికి ముందు ఇద్ద‌రు ఏడేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు.

ఒక‌ర్ని ఒక‌రు బాగా అర్దం చేసుకున్నాకే వివాహ బంధంతో ఒక‌ట‌య్యారు. కానీ ఈ జోడీకి పిల్ల‌లు లేరు. వివాహానికి నెల రోజుల ముందే బ్రిట్నీ స్పియ‌ర్ కి గ‌ర్బ‌స్రావం అయింది. అప్ప‌టి నుంచి జోడీ పిల్ల‌ల విష‌యంలో మ‌ళ్లీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇక బ్రిట్నీ స్పియ‌ర్ కిది మూడ‌వ వివాహం. గ‌తంలో ఆమె చిన్న‌నాటి స్నేహితుడు జాస‌న్ అలెగ్జాండ‌ర్ తో 2004 లోవివాహ‌మైంది. ఇద్ద‌రు క‌లిసి ఏడాది ఉన్నారు. ఆ త‌ర్వాత విడాకులు తీసుకున్నారు.

Read more!

అదే ఏడాది కెవిన్ ఫెడర్ లైన్ తో రెండ‌వ వివాహం జ‌రిగింది. ఈ జంట‌కు ఇద్ద‌రు కుమారులు గ‌ల‌రు. కానీ ఈ జోడీ వివాదాలు రావ‌డంతో 2007 లో విడిపోయారు. ఇక 2016 లో న‌టుడు సామ్ అస్గారితో ప్రేమ‌లో ప‌డ్డారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2021 లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. 2022 లో స్నేహితుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నారు. 2024లో కోర్టు స‌మ‌క్షంలో విడిపోయారు. అదీ సంగ‌తి.

పాప్ గాయ‌నిగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగించిన బ్రిట్నీ ఫ్యామిలీ లైఫ్ లో వివాహం క‌లిసి రాలేద‌ని నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆమె మూడు పెళ్లిళ్ల‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇక వృత్తి ప‌రంగా బ్రిట్నీ స్పీడ్ ఇప్ప‌టికీ మామూలుగా లేదు. అదే ఛ‌రిష్మాతో దూసుకుపోతున్నారు.

Tags:    

Similar News