పిక్ టాక్ : ఒకే ఫ్రేమ్ లో శివ - అర్జున్ రెడ్డి
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను కలిశాడు. 'కబీర్ సింగ్' సక్సెస్ ను వీరిద్దరు ముంబయిలోని ఒక స్టార్ హోటల్ లో ఎంజాయ్ చేశారు. ఏదైనా ఒక సినిమా నచ్చితే వర్మ ఆ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా కబీర్ సింగ్ చిత్రాన్ని చూసిన వర్మ ఆ చిత్రంపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు. పెట్టిన పెట్టుబడికి వస్తున్న వసూళ్లను బట్టి చూస్తే 'బాహుబలి 2' కంటే నాలుగు రెట్లు అధికంగా ఈ చిత్రం రాబడుతుందని వర్మ అన్నాడు.
ఇక బాహుబలి 2 చిత్రం రెండేళ్లు చిత్రీకరణకు తీసుకుంటే కబీర్ సింగ్ కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేశాడు. అదే సమయంలో దర్శకుడు కబీర్ సింగ్ పై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు పార్టీ పిక్ ను వర్మ షేర్ చేశాడు. సందీప్ రెడ్డి మరియు వర్మల పార్టీ పిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వీరిద్దరు కూడా మొదటి సినిమాతోనే సెన్షేన్ క్రియేట్ చేశారు. తెలుగులో కెరీర్ ఆరంభించి బాలీవుడ్ లో సత్తా చూపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ సెన్షేషన్ డైరెక్టర్స్ అయిన వర్మ మరియు సందీప్ రెడ్డి వంగలను ఇలా ఒకే ఫ్రేమ్ లో చూడటం చాలా బాగుందని.. శివ - అర్జున్ రెడ్డిలను సింగిల్ ఫ్రేమ్ లో చూడటం అమెజింగ్ గా అనిపిస్తుందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వర్మ బాలీవుడ్ లో సెటిల్ అయిన తరహాలోనే సందీప్ రెడ్డి కూడా బాలీవుడ్ లో సెటిల్ అవ్వనున్నాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి కలయిక టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.