రంగస్థలం.. మరో ఇంట్రెస్టింగ్ పిక్

Update: 2017-12-20 11:42 GMT

2018 టాలీవుడ్ లో ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినా ఎంత పెద్ద స్టార్ సినిమా వచ్చినా అన్ని చిత్రాలకంటే సరికొత్త చిత్రం రంగస్థలం 1985 అనే చెప్పాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగా తనను తాను నిరూపించుకొని సరికొత్త సినిమాను ప్రేక్షకులకు అందించాలని చూస్తున్నాడు. ఇక సుకుమార్ ఎప్పుడూ స్టైలిష్ సినిమాలను తీయడానికి ఇష్టపడుతుండేవాడు. కానీ ఈ సారి ఏకంగా పల్లెటూరి కథను చాలా ట్రెడిషినల్ గా చూపించడానికి రెడీ అవుతున్నాడు.

ఇటీవల సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఊర మాస్ లెవెల్ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇక సమంత ని చూసి ఎవరు నమ్మలేకపోయారు. అయితే సినిమా 1985 కాలం నాటిది కావడంతో సినిమాలో సెట్స్ ని రేంజ్ లో క్రియేట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  గతంలో సినిమాకు సంబందించిన కొన్ని సెట్స్ లుక్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ మరో లుక్ ని కూడా రిలీజ్ చేశారు.

అప్పట్లో త‌ప్పెట‌గుళ్ల నాట్యకారులు బాగా ఉండేవారు. అది గ్రామీణ ప్రజలకు బాగా తెలిసిన విషయమే. అయితే సినిమాలో ఆ విషయాన్నీ కూడా సుకుమార్ ప్రస్తావిస్తున్నాడని తెలుస్తోంది. షూటింగ్ స్పాట్ లో చరణ్ వారితో  ఫొటో కూడా దిగాడు. అనంతరం సోషల్ మీడియా ఏకౌంట్ లో పోస్ట్ చేసి.. 'మ‌రో రోజు. జాన‌ప‌దంలో మ‌రో క‌ళకు చెందిన తప్పెట‌గుళ్ల గురించి చాలా తెలుసుకున్నాను. అంతే కాకుండా వారిని కలిశాను' అంటూ చరణ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ ఫొటో మెగా అభిమానులు చాలా ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News