రామ్ చరణ్ వరసలు మరిచిపోయాడేంటి?
రామ్ చరణ్ వయసు 32 ఏళ్లు.. వరుణ్ తేజ్ వయసు 28 ఏళ్లు. వరుణ్ కు చరణ్ అన్నయ్య అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ రామ్ చరణ్ మాత్రం వరుణ్ ను అన్నయ్య అని సంబోధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వరుణ్ కొత్త సినిమా ‘తొలి ప్రేమ’ ట్రైలర్ గురించి స్పందిస్తూ చరణ్.. వరుణ్ ను అన్నయ్య అని సంబోధించాడు. ఈ సినిమా విజువల్స్.. ప్రతి సీన్ చాలా తాజాగా అనిపిస్తోందని.. ఈ చిత్రం కచ్చితంగా అంచనాల్ని అందుకుంటుందని చెబుతూ ‘‘వరుణ్ అన్న కెరీర్లో ఇదొక మైలురాయిలా నిలిచిపోతుందని నమ్ముతున్నా’’ అని చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో మెసేజ్ పెట్టాడు. మరి పొరబాటున వరుణ్ ను అన్న అనేశాడా లేదా తన కంటే పొడవుంటాడు కాబట్టి సరదాగా అతణ్ని అలా ఆట పట్టించాడా అన్నది చరణ్ కే తెలియాలి.
వరుణ్ ను అన్నయ్య అన్న చరణ్ మరోవైపు తనకు బావమరిది వరసయ్యే సాయిధర్ తేజ్ ను ‘బ్రదర్’ అని సంబోధించడం మరో విశేషం. తేజు కొత్త సినిమా ‘ఇంటిలిజెంట్’ టీజర్ గురించి కూడా చరణ్ స్పందించాడు. ఈ టీజర్ ప్రతి ఫేమ్ లోనూ దర్శకుడు వి.వి.వినాయక్ మ్యాజిక్ కనిపిస్తోందని.. ‘‘బ్రదర్ సాయికిది ఒక మరపురాని సినిమా అవుతుంది’’ అని చరణ్ అన్నాడు. మెగా ఫ్యామిలీలో ఇలా వరసలు మార్చి పిలవడం మామూలే. అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్ మావయ్య అయినప్పటికీ ఆయన్ని అతను బాబాయి అని కొన్ని పబ్లిక్ ఫంక్షన్లలో సంబోధించడం గుర్తుండే ఉంటుంది. ఆ కోవలోనే వరుణ్ ను అన్న అని.. తేజును బ్రదర్ అని అన్నట్లున్నాడు రామ్ చరణ్.