• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చొక్కా విప్పడానికి రామ్...

చొక్కా విప్పడానికి రామ్ చరణ్ రెడీ

By - Tupaki Desk
Update: 2018-06-06 04:29 GMT
బాలీవుడ్ లో టాప్ హీరోలు సల్మాన్ ఖాన్.. హృతిక్ రోషన్.. అక్షయ్ కుమార్ లాంటి వాళ్లంతా చొక్కా విప్పి కండల ప్రదర్శన చేసిన వారే. సల్మాన్ అయితే దాదాపుగా ప్రతి సినిమాలోనూ ఒక్క సీన్ లో అయినా షర్ట్ వేసుకోకుండా కనిపించి అమ్మాయిలతో విజిల్స్ వేయిస్తుంటాడు. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కూ పాకింది.

అయితే సినిమాలో షర్ట్ విప్పి కనిపించేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు. దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే బాడీ కరెక్ట్ షేప్ లో ఉంటేనే ఆ సీన్ పండుతుంది. అందుకే ఎన్టీఆర్ తన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ కోసం మూడు నెలలు జిమ్ లో తెగ కష్టపడ్డాడు. తాజాగా రిలీజ్ చేసిన అరవింద సమేత పోస్టర్ లో షర్ట్ లేకుండా ఎన్టీఆర్ ఫైట్ కు సిద్ధమైన స్టిల్ అదిరిపోయింది. ఇఫ్పుడు రామ్ చరణ్ కూడా తన నెక్ట్స్ మూవీలో షర్ట్ లేకుండా కనిపించేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పర్సనల్ ట్రైనర్ రాకేష్ వుడియార్ దగ్గర ట్రయినింగ్ తీసుకోవడం మొదలెట్టాడు.

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ చరణ్ ప్రస్తుతం మూవీ చేస్తున్నాడు. ఇందులో వచ్చిన ఓ భారీ ఫైట్ ఎపిసోడ్ లో చరణ్ చొక్కా విప్పి తన కండలతో విలన్లను ఎదుర్కోతున్నాడు. అసలే బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లు ఓ రేంజిలో ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ షర్ట్ లేకుండా ఫైట్ కు దిగడం అంటే సామాన్యంగా ఉండదు మరి. ఈ విషయంలో అభిమానులను మెప్పించడానికి రామ్ చరణ్ జిమ్ లో చాలానే కష్టపడుతున్నాడు.
Tags:    
  • Ram Charan 
  • Shirtless 
  • Boyapati Seenu 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS