• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ తర్వాత నిర్మించే...

చరణ్ తర్వాత నిర్మించే సినిమాలేవంటే..

By - Tupaki Desk
Update: 2016-11-17 11:41 GMT
తన ఫ్యామిలీలో ఆల్రెడీ గీతా ఆర్ట్స్.. అంజనా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్లున్నా.. తన తండ్రి రీఎంట్రీ మూవీ కోసం సొంతంగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్ పెట్టి నిర్మాతగా మారాడు రామ్ చరణ్. మరి ఈ బేనర్ ఆ తర్వాత ఏం చేస్తుంది.. ఎవరితో సినిమాలు తీస్తుంది.. అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఐతే రామ్ చరణ్ ఆ తర్వాత కూడా సినిమాలు నిర్మిస్తాడని సమాచారం. అతను బయటి హీరోలతో సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం విశేషం. హీరోలు బయటి వాళ్లే కానీ.. అతడికి చాలా దగ్గరి వాళ్లే. తన చిన్ననాటి స్నేహితులైన శర్వానంద్.. అక్కినేని అఖిల్ లతో సినిమాలు తీయబోతున్నాడట రామ్ చరణ్.

శర్వానంద్ తో రామ్ చరణ్ స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగుతున్నారు. అతడితో కొణిదెల ప్రొడక్షన్స్ రెండో సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘శతమానం భవతి’తో పాటు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు శర్వా. ఆ తర్వాత అతను చేసే చిత్రం రామ్ చరణ్ ప్రొడక్షన్లోనే అని అంటున్నారు. ఈ సినిమా తక్కువ బడ్జెట్లో రూపొందుతుందట. ప్రస్తుతం సొంత బేనర్లో విక్రమ్ కుమార్ సినిమాను మొదలుపెట్టబోతున్న అఖిల్ కూడా రామ్ చరణ్ ప్రొడక్షన్లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్టుల గురించి త్వరలోనే అధికారిక సమాచారం వస్తుందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Ram Charan 
  • Sharwanand 
  • Akhil 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS