• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జనవరి 7న రామ్ చరణ్ సినిమా...

జనవరి 7న రామ్ చరణ్ సినిమా రిలీజ్

By - Tupaki Desk
Update: 2016-12-29 01:30 GMT
ఆల్రెడీ రామ్ చరణ్ సినిమా మూడు వారాల కిందటే రిలీజైంది. అతడి తర్వాతి సినిమా ఇంకా మొదలే కాలేదు. మరి జనవరి 7న రామ్ చరణ్ సినిమా రిలీజవ్వడమేంటి అంటారా..? ఇక్కడ మాట్లాడుతోంది తెలుగులో చరణ్ సినిమా విడుదల గురించి కాదు. అతడి తమిళ సినిమా రిలీజ్ గురించి. రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన ‘తుపాన్’ సినిమాను తమిళంలో ‘సూపర్ పోలీస్’ పేరుతో అనువదించడం విశేషం. ఇది చరణ్ మూడేళ్ల కిందట నటించిన సినిమా. ఇంకేవీ లేనట్లుగా ఈ చిత్రాన్ని ఏరి కోరి తమిళంలోకి అనువాదం చేశారు. ఈ చిత్రం జనవరి 7న విడుదలవుతోంది.

తెలుగు సినిమాల్ని తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేయడంలో పెద్ద చరిత్ర ఉన్న ‘భద్రకాళి ఫిలిమ్స్’ సంస్థ ‘తుపాన్’ను ‘సూపర్ పోలీస్’ పేరుతో డబ్ చేసింది. సంక్రాంతికి భారీ సినిమాలతో కోలీవుడ్ జనాలు రెడీ అవుతుండగా.. ముందు వారం చరణ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది ‘బ్రూస్ లీ’ సినిమాను కూడా తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేసింది ‘భద్రకాళి ఫిలిమ్స్’. ఫలితం నిరాశాజనకమే. అయినా చరణ్ సినిమాల్లో పెద్ద డిజాస్టర్ అయిన సినిమాను తమిళంలోకి అనువాదం చేశారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒకప్పటి క్లాసిక్ ‘జంజీర్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటించింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Ram Charan 
  • Super Police 
  • Telugu NEws 

Similar News

"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"

2026-11-17 17:42 GMT

నా జీవితంలో క్లిష్టమైన రోజులవే.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఉపాసన కామెంట్స్!

2026-11-17 17:39 GMT

సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో తొలి 1000 కోట్లు!

2026-11-17 12:46 GMT

32 దేశాల్లో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ మూవీకి ఘోర అవమానం!

2026-11-17 12:46 GMT

దాదా వ‌ర్సెస్ కాకా..ద‌బిడి దిబిడే!

2026-11-17 12:45 GMT

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

2026-11-17 11:15 GMT

చైతూ.. పుష్ప బ్రాండ్ కలిసొచ్చేనా?

2026-11-17 10:37 GMT

తప్పు ఎవరిదైనా శిక్ష ఆడదానికేనా.. సమంత సూటి ప్రశ్న?

2026-11-17 10:33 GMT

బిగ్ బాస్ బ్యూటీ.. బూతు పాటతో వార్నింగా?

2026-11-17 10:32 GMT

పట్టుచీరలో సీతమ్మ ఎంత అందంగా ఉందో!

2026-11-17 10:21 GMT

Copyright @2026

Powered by Blink CMS