చరణ్‌ ఏంటి? షాక్‌ ల మీద షాక్‌ లు??

Update: 2015-09-01 08:03 GMT
చరణ్‌ కి భక్తి, ముక్తి రెండిటి పై పూర్తి నమ్మకం ఉందని మనకు తెలుసు. టాలీవుడ్‌ లో భగవంతుని నమ్మే హీరోల్లో చరణ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అతడు ప్రతియేటా స్వామి అయ్యప్ప మాలను వేసుకుని ధీక్ష చేపడుతుంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రతిసారీ అతడు షూటింగుల్లేక ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా అయ్యప్ప మాలను ధరిస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం అతడు షాకింగ్‌ సర్‌ ప్రైజ్‌ ఇచ్చాడు.

ఓవైపు బ్రూస్లీ సినిమా సెట్స్‌ లో ఉండగానే అతడు సడెన్‌ గా అయ్యప్ప మాల ధరించి షాకిచ్చాడు. ఇదెలా సాధ్యం? అంటూ అభిమానుల్లో డిష్కసన్స్‌ సాగుతున్నాయిప్పుడు. అయ్యప్ప మాల అంటే కనీసం 40 రోజులు ధీక్ష చేయాల్సిందే. కాబట్టి అప్పటివరకూ షూటింగుల్లో పాల్గొనకుండా ఉంటాడా? బ్రూస్‌ లీ షూటింగ్‌ ఇంకా పెండింగ్‌ ఉండనే ఉంది. పాటలు తీయాలి.. కొన్ని ప్యాచ్‌ వర్కు సీన్ లు పెండింగ్‌. మరి ఇప్పుడు ఎందుకిలా చేసినట్టు? ఇప్పటికే దసరా బరిలో బ్రూస్ లీ వచ్చేస్తున్నాడు అంటూ చెబుతున్నారు. అక్టోబర్‌ 16 రిలీజ్‌ తేదీ అంటూ ప్రకటించారు. చరణ్‌ యాక్టివిటీని బట్టి అప్పుడు సినిమా లేనట్టేనా? డిసెంబర్‌ లేదా జనవరి వరకూ వేచి చూడాల్సిందేనా?

ఒకవేళ మాల వేసుకొని కూడా షూటింగుల్లో పాల్గొంటాడా? ఎందుకంటే నటన అనేది ప్రొఫెషన్‌ కాబట్టి బట్టలు మార్చుకొని షూటింగ్‌ చేసినా పర్లేదమో. పురాణాల్లో అలాంటి రిలీఫ్‌ క్లాజ్‌ ఉందేమో మరి ఈ సినిమావాళ్ళకే తెలియాలి. ఈ మాల వెనుక మీనింగ్‌ ఏంటో చెప్పవయ్యా చెర్రీ. ఇకపోతే నిన్నటిరోజున కన్నడ నటుడు శివ రాజ్‌ కుమార్‌ తనయురాలు నిరుపమ వివాహ మహోత్సవంలో చరణ్‌ అయ్యప్ప మాలధారియై కనిపించి అందరికీ షాకిచ్చాడు. అదీ సంగతి.
Tags:    

Similar News