రామ్ చరణ్ రామాయణం నిజమేనా?

Update: 2017-05-16 04:41 GMT
కొన్ని రోజుల క్రితం రామాయణం సబ్జెక్ట్ పై సినిమా తీయబోతున్నామంటూ చెప్పి అల్లు అరవింద్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతుందని.. మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారే టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయిపోయింది.

అల్లు అరవింద్-500 కోట్ల బడ్జెట్- రామాయణం.. ఈ మూడింటినీ బేస్ చేసుకుని సోషల్ మీడియాలో హంగామా మొదలైపోయింది. రామ్ చరణ్ ను రాముడిగా మార్చేసి పోస్టర్ డిజైన్ చేసేశారు. ఇదెంత పర్ఫెక్ట్ ఉంటుందంటే.. ఓ మూవీకి యూనిట్ ఫస్ట్ లుక్ ఇచ్చినట్లుగా ఉంటుంది. అయితే.. దీనిపై రామ్ చరణ్ నుంచి కానీ.. ఈ హీరో టీం నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ లేదు. కనీసం కాదు అని చెప్పకపోవడమే.. ఇక్కడ అసలు సిసలైన టాపిక్. పైగా రీసెంట్ గా మెగా పవర్ స్టార్ వైఫ్ ఉపాసనకు చెందిన పీఆర్ ఏజన్సీల నుంచి మీడియాకు కొన్ని ఫోటోలు అందాయి.

అందులో ఉన్నది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రామ్ చరణ్ రామాయణం ఫోటోనే కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదంతా చూస్తుంటే నిజంగానే రామ్  చరణ్ రామాయణం మూవీ చేస్తున్నాడా అనే డౌట్స్ చాలా మందిలో మొదలయ్యాయి. మగధీర తర్వాత చెర్రీ నుంచి అంతకు మించిన హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ ఏర్పాట్లు జరిగిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News