రామ్ చరణ్ లుక్కు మారిందహో..

Update: 2018-03-16 12:56 GMT
రామ్ చరణ్ గత ఏడాది కాలానికి పైగా గెడ్డం లుక్ లోనే ఉన్నాడు. ధృవ మూవీ రిలీజ్ కి ముందు నుంచి గెడ్డం పెంచుతున్నాడు మెగా పవర్ స్టార్. అంటే 2016 చివర నుంచీ అన్నమాట. ఆ తర్వాత 2017 గడిచిపోయింది. ఇప్పుడ 2018 వచ్చాక కూడా మూడో నెల గడుస్తోంది. ఇంత సుదీర్ఘ కాల పాటు గెడ్డంతోనే ఈ స్టార్ హీరోను చూస్తూ ఉన్నారు జనాలు.

ఇప్పుడు సడెన్ గా తన లుక్ ను మార్చేసుకున్నాడు రామ్ చరణ్. రంగస్థలం మూవీ కోసం దాదాపు ఏడాదిన్నర కాలం అదే గెడ్డాన్ని మెయింటెయిన్ చేసిన చరణ్.. రీసెంట్ టైం వరకూ అదే కంటిన్యూ చేశాడు. మొత్తానికి రంగస్థలం ఫస్ట్ కాపీ కూడా ప్రిపేర్ అయిపోయాక.. అపుడు గెడ్డం తీసేశాడు మెగా పవర్ స్టార్. ఇప్పుడు లేటెస్ట్ గా క్లీన్ షేవ్ లుక్ తో కనిపిస్తున్నాడు. మెగా అభిమానులతో కలిసి సందడి కూడా చేశాడు. మరో రెండు రోజుల్లో రంగస్థలం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వైజాగ్ లో గ్రాండ్ లెవెల్ లో జరగబోతుండగా.. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు చెర్రీ.

రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందే రామ్ చరణ్ తన గెడ్డాన్ని తీసేయడం విశేషం. ఈ కార్యక్రమం అయ్యే వరకూ చిట్టిబాబుగానే కనిపిస్తాడని అంతా భావించారు. అయితే.. అలాంటివి పట్టించుకోకుండా.. తన నెక్ట్స్ మూవీ ప్రిపరేషన్స్.. రంగస్థలం ప్రమోషన్స్.. ఈ రెండింటికీ గెడ్డం లేకుండానే హ్యాండిల్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు రామ్ చరణ్ తేజ్.
Tags:    

Similar News