చెర్రీ మళ్లీ లుక్కులతో చంపేస్తాడటగా
మెగా పవర్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవలో.. రామ్ చరణ్ లుక్స్ చూసి చాలామందికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పటివరకూ టాలీవుడ్ లో చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్ చూపించారు కానీ.. అదంతా ఓ పాట కోసమో.. ఓ పైట్ కోసమో చొక్కా విప్పేసి ప్యాకులు చూపించడం వరకే పరిమితం. మిగిలిన సినిమా అంతా యథావిధిగా తమ ఒరిజినల్ బాడీతోనే ఉంటారు. కానీ చెర్రీ మాత్రం ధృవ కోసం సినిమా అంతా ఒకే రకమైన బాడీ మెయింటెయిన్ చేసి.. సిక్స్ ప్యాక్ లుక్స్ ఉన్న బాడీతో ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. ఇంతటి మేకోవర్ చరణ్ నుంచి అసలు ఊహించనిదే అని చెప్పాలి.
తన తర్వాతి మూవీగా సుకుమార్ తో చేయనున్నట్లు చెప్పిన చరణ్.. మరోసారి మేకోవర్ తో షాక్ ఇవ్వనున్నాడట. ఈసారి బాగా పెంచిన గుబురు గెడ్డంతో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. అందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడట. చెర్రీ లుక్ పై వర్కవుట్ చేసేందుకు ఇప్పటికే బాలీవుడ్ నుంచి స్పెషల్ స్టైలిష్ట్ ను కూడా రంగంలోకి దించేశారట.
తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడం సుకుమార్ అలవాటు అదే ట్రెండ్ చరణ్ తో కూడా కంటిన్యూ చేయనున్నాడని.. చెర్రీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తోనే ఆడియన్స్ కి బిగ్ షాక్ ఇచ్చేలా సుక్కు ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది. జనవరి చివరి వారంలో సుకుమార్ - చెర్రీల సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/