చెర్రీతో ఉన్న ఆ బాబు ఎవరో తెలుసా?

Update: 2017-11-21 07:58 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ లైఫ్ లో రకరకాల పాత్రల్లో కనిపించినా రియల్ లైఫ్ లో మాత్రం చాలా సరదాగా ఉంటాడు. ముఖ్యంగా సతీమణితో మెగా పవర్ స్టార్ చాలా సరదాగా ఉంటాడు. ఇక మెగా ఫ్యామిలిలో చిన్న పిల్లలు ఒక దగ్గర చేరి ఆడుకుంటుంటే వారితో పాటు చరణ్ కూడా కలిసి అల్లరి చేస్తాడట. అలాగే మెగా యువ హీరోలను అప్పుడపుడు ఆటపట్టిస్తూ ఉంటాడని వారి కుటుంబ సభ్యులు చెబుతూ ఉంటారు.

ముఖ్యంగా చరణ్ కి పిల్లలంటే చాలా ఇష్టమని ఉపాసన కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇకపోతే రీసెంట్ గా చెర్రీ ఒక బాబుతో కలిసి గుర్రపు స్వారీ చేశాడు. పైనున్న ఫొటోలో ఆ పిల్లాడు ఎవరాని అనుకుంటున్నారా? ఓ విధంగా కాబోయే హీరో అనుకోవచ్చు. ఎందుకంటే ఆ పిల్లాడు స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తనయుడు. మెగా పవర్ స్టార్ కి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం.

ఈ మెగాధీరుడి దగ్గర గుర్రాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం సైరా సినిమాకోసం కొన్ని గుర్రాలను రెడీ చెయ్యాలని చెర్రీతో కలిసి దర్శకుడు గుర్రాలను సెలెక్ట్ చేస్తున్నాడు. ఈ తరుణంలో సురేందర్ రెడ్డి తనయుడు కూడా ఉండడంతో చెర్రీ అతనికి హార్స్ రైడింగ్ థ్రిల్ ని చూపించాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం దర్శకుడు నిర్మాత రామ్ చరణ్ అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అది సంగతి.
Tags:    

Similar News