సుకుమార్ కోసమే ఈ కష్టాలు -చెర్రీ

Update: 2016-12-26 04:35 GMT
రామ్ చరణ్ నటించిన ధృవ మూడో వీకెండ్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టడంతో డిస్ట్రిబ్యూటర్స్ అంతా సంతోషంగా ఉన్నారు. ధృవ మూవీ షూటింగ్ అంతా ఫిట్నెస్.. లుక్స్ పై బాగా కాన్సంట్రేషన్ చేసిన చెర్రీ.. ఇప్పుడు ధృవ ప్రమోషన్స్.. మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీ అయిపోయాడు. అందుకే కనీసం గడ్డం కూడా తీయడం లేదని అనుకుంటున్నారు చాలామంది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పేశాడు మెగా పవర్ స్టార్. చరణ్-అరవింద్ స్వామిలను ఇంటర్వ్యూ చేసిన హరీష్ శంకర్.. 'గెడ్డం తీయకుండా పెంచుతున్నారు.. ఇదంతా సుకుమార్ సినిమా కోసమేనా.. ఎప్పుడు మొదలవుతుంది' అని అడిగాడు హరీష్ శంకర్. 'నాకు ఇవాళే షూటింగ్ మొదలుపెట్టేద్దామని ఉంది. సుకుమార్ కి చూపిస్తే ఇంకా పెంచాలని అన్నారు. సంక్రాంతి తర్వాత మళ్లీ ఓసారి నా మొహం చూపిస్తా' అన్నాడు చరణ్.

'అప్పటికి కూడా ఇంకా పెంచాలని అన్నారనుకోండి. ఇంకో నెల్లాళ్లు పడుతుందేమో గడ్డం పెరగడానికి' అంటూ జోక్ చేశాడు చరణ్. మొత్తానికి సుకుమార్ మూవీలో తాను పెద్ద గడ్డం పెంచి కనిపించబోతున్నాననే సంగతి తేల్చేశాడు. అలాగే మణిరత్నంతో సినిమా చేస్తున్నారటగా అంటే మాత్రం.. నాకు తెలీని విషయాలు చెబుతున్నారు అనేశాడు రామ్ చరణ్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News