• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్‌ కోసం రూటు మార్చిన...

చరణ్‌ కోసం రూటు మార్చిన శీను

By - Tupaki Desk
Update: 2015-01-20 15:23 GMT
టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శ్రీనువైట్ల సినిమా అనగానే కామెడీ ఎంటర్‌టైనర్‌  ఎవరైనా ఇట్టే  చెప్పేస్తారు. అతడి జోనర్‌ కామెడీ. కడుపుబ్బా నవ్వించడం. ప్రతి సన్నివేశంలో నవ్వించడం అన్నదే అతడి ఫార్ములా. అందుకు తగ్గట్టే ఇంతకాలం సినిమాలు తెరకెక్కించి విజయాలు అందుకున్నాడు.

ఆనందం, దుబాయ్‌శీను, దూకుడు, బాద్‌షా అన్నీ కామెడీ ఎంటర్‌టైనర్‌లే. యాక్షన్‌ మేళవించి కామెడీ చేయించడం శ్రీను ప్రత్యేకత. ఈ సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి. అయితే మహేష్‌ హీరోగా తెరకెక్కించిన ఆగడు మాత్రం పెద్ద ఝలక్‌ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైంది. దాంతో ఇప్పుడు చరణ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న 'మై నేమ్‌ ఈజ్‌ రాజు' చిత్రం విషయంలో శ్రీను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి రొటీన్‌ భిన్నంగా కొత్త పంథా కథ రాసుకున్నాడని సమాచారం. రొటీన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌లా కాకుండా కామెడీ ఉంటూనే థ్రిల్లర్‌ పంథాలో సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కామెడీలోనూ రొటీనిటీ లేకుండా నవ్యపంథాలో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట.

చరణ్‌ ఈ చిత్రంలో ఓ బైక్‌ రేసర్‌. రాజు అనే బైక్‌ రేసర్‌ జీవితం ఎలా సాగింది? అన్నదే సినిమా. సమంత ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుందని సమాచారం. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే ఫార్ములాలో సినిమా తీస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఆగడుతో తెలిసింది కాబట్టి శ్రీనులో ఈ మార్పు వచ్చిందని అంటున్నారంతా
Tags:    
  • Ram charan 
  • Srinu Vaitla 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS