మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం ఒక నటుడే కాదు. ఆయన ఒక సేవా మూర్తి కూడా. బ్లడ్ బ్యాంక్.. ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో విశిష్ట సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇక ఈ సేవా కార్యక్రమాల విషయంలో డ్యాడ్ వేసిన బాటలోనే వెళ్లానంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం.
మ్యాటర్ ఏంటంటే.. నిన్న జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో కేఎఫ్ సీకి చెందిన 500 మంది ఎంప్లాయిస్ రక్తదానం చేశారు. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఒక సంస్థకి చెందిన ఉద్యోగులు ఇలా ఒకేసారి బ్లడ్ డొనేట్ చేయడం ఎంతో బాగుందని.. నేను కూడా త్వరలోనే ఈ కార్యక్రమాలను మొదలెడతాను. డాడ్ చూపించిన మార్గంలోనే సేవలను కొనసాగిస్తాను. బ్రూస్ లీ సినిమా గురించి మట్లాడిన చెర్రీ.. ఇదో మాంచి మెసేజ్ ఉన్న మూవీ అంటూ సెలవిచ్చాడు. ఇకపోతే రిలీజ్ కు ముందు రోజున మనోడు అంధ విద్యార్థులతో కలిసి ఒక సె్పషల్ షో చూడనున్నట్లు కూడా మరోసారి తెలిపాడు.
ఇదంతా ఓకె కాని.. చరణ్ మరో క్వశ్చన్ ను మాత్రం సింపుల్ గా దాటేశాడు. పవర్ స్టార్ ప్రొడక్షన్ లో మీరు ఓ సినిమా నటించాల్సి ఉందిగా.. అప్పట్లో ఆ సినిమా గురించి పవన్ కళ్యాన్ ఆఫీస్ ఒక సర్కులర్ కూడా పంపింది.. దాని గురించి ఏమన్నా న్యూస్ వినొచ్చా మేం? అనడిగితే.. ''ముందు సర్దార్ గబ్బర్ సింగ్ పూర్తవ్వనివ్వండి.. ఆ తరువాత దాని గురించి ఆలోచించుదాం'' అంటూ చరణ్ సెలవిచ్చాడు.