లేదు.. మేం పూరితో ముందే చెప్పాం

Update: 2015-10-14 22:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి తన 150వ సినిమా విషయంలో.. సెకండాఫ్‌ బాలేదంటూ తనకు డైరెక్టుగా చెప్పకుండా.. మీడియాతో చెప్పారు.. అంటూ పూరి జగన్‌ ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏమైందో ఏమో కాని.. పూరి మాత్రం అనేక రకాలు స్టేట్‌మెంట్లు ఇచ్చాడు.

''నేను 150 కాకపోతే 151వ సినిమా తీస్తా. మెగాస్టార్‌ తో సినిమా తీయడం అనేది నా కల'' అంటూ ఒక పెద్ద ప్రెస్‌ నోటును ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశాడు పూరి జగన్‌. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌ లో అసలు 150వ సినిమా నిర్మాత రామ్‌ చరణ్‌ ఏమనుకుంటున్నాడు మరి? అసలు తను ఏం చెప్పదలిచాడు? నిన్న జరిగిన మీడియా మీట్‌ లో .. 'మీరు పూరి కి చెప్పకుండా క్యాన్సిల్‌ చేశారటగా.. నిజమేనా??' అని అడిగితే.. చరణ్‌ ఏమన్నాడో తెలుసా?

''అలాంటిదేం లేదు. ముందుగా పూరితోనే చెప్పాం. అతడు లోఫర్‌ సినిమాతో బిజీగా ఉన్నప్పుడు అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దని అనుకున్నాం. మా కథ చెప్పమని ఫోర్స్‌ చేయాలనుకోలేదు'' అని సెలవిచ్చాడు చరణ్‌. ఇక్కడ ఒక విషయం అర్ధమవుతోంది. ఇక ప్రక్కన 150వ సినిమా స్ర్కిప్టు పనులు జరుగుతుంటే.. అసలు లోఫర్ సినిమా మొదలెట్టడమేంటి? అక్కడే మెగా క్యాంపుకు మండిపోయి ఉండాలి.
Tags:    

Similar News