రాళ్లపల్లి అప్పట్లోనే చావు వరకు వెళ్లారు

Update: 2019-05-20 04:57 GMT
టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాళ్లపల్లి నరసింహారావు మరణం సినీ వర్గాలను శోఖంలో ముంచేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు అందరితో కూడా కలివిడిగా ఉంటూ, అందరితో మంచి వాడు అనుకున్న వ్యక్తి రాళ్లపల్లి. ఎన్నో వందల సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించిన రాళ్లపల్లికి నేడు హైదరాబాద్‌ లో అంత్యక్రియలు జరుగబోతున్నాయి. అమెరికాలో ఉన్న చిన్న అల్లుడు రావడంకు ఆలస్యం అయిన కారణంగా అంత్యక్రియలు ఆలస్యం చేశారు. రాళ్లపల్లి పెద్ద కూతురు విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అప్పట్లో ఈ విషయం పెద్దగా ప్రచారం జరగలేదు కాని ఇప్పుడు మాత్రం రాళ్లపల్లి పెద్ద కూతురు గురించి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.

రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె డాక్టర్‌ చదువుకోసం రష్యా పంపాలనుకున్నాడు. అందుకోసం అంతా సిద్దం చేశాడు. ఆమెతో పాటు ఆమె స్నేహితులు కూడా హైదరాబాద్‌ నుండి రష్యాకు బయలుజేరారు. రష్యాకు వెళ్లాలి అంటే ఢిల్లీకి వెళ్లి అక్కడ నుండి రష్యా విమానం ఎక్కాల్సి ఉందట. ఢిల్లీకి వెళ్లేందుకు హైదరాబాద్‌ నుండి విమానంలో కాకుండా రైల్లో ఆమె స్నేహితులతో కలిసి వెళ్లింది. మార్గం మద్యలో ఆమెకు బ్రెయిన్‌ ఫీవర్‌ వచ్చింది.

రైల్లో ఉన్న కారణంగా ఏం చేయాలేని పరిస్థితి. ఢిల్లీకి వెళ్లేప్పటికి ఆమె చనిపోయింది. పెద్ద కూతురు చనిపోవడంతో రాళ్లపల్లి డిప్రెషన్‌ లోకి వెళ్లి పోయాడు. చాలా నెలల పాటు తేరుకోలేక పోయాడు. ఆయన ఆ సమయంలోనే చావు వరకు వెళ్లి వచ్చాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ తర్వాత చిన్న కూతురు పెళ్లి అవ్వడం, చిన్న అల్లుడు కొడుకు మాదిరిగా చూసుకోవడంతో రాళ్లపల్లి మళ్లీ మామూలు మనిషి అయ్యాడంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నాడు. అల్లుడే అయినా కొడుకు మాదిరిగా రాళ్లపల్లిని చూసుకునేవాడని, అందుకే ఆయన రాక ఆలస్యం అయినా కూడా పార్ధివ దేహంను అలాగే ఉంచారు.
Tags:    

Similar News