అక్షయ్ కుమార్ సరసన రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ లో పాగా వేస్తోందిగా!

Update: 2021-06-29 09:30 GMT
దక్షిణాది నుండి ఉత్తరాది వరకు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఎందుకంటే దక్షిణాది చిత్రపరిశ్రమలో దాదాపు అందరూ హీరోలతో మూవీస్ చేసేసింది ఈ పొడుగుకాళ్ళ సుందరి. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలు కూడా  లైనప్ చేసి పెట్టేసింది. చేతినిండా సినిమాలతో ఇప్పట్లో ఖాళీ లేకుండా బిజీగా గడుపుతోంది. జయజానకినాయక సినిమా తర్వాత రకుల్ తెలుగులో ఒక హిట్ కూడా అందుకోలేదు. ఆ మధ్యలో కింగ్ నాగ్ తో మన్మధుడు-2 చేసినా అది రివర్స్ అయింది. అలాగే ఈ ఏడాది చెక్ సినిమాలో నటించింది.

కానీ చెక్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇప్పటికైతే టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్రామీణ నేపథ్యం కలిగిన మూవీ చేసింది. ప్రస్తుతం రకుల్ ఏ భాషలో అయినా హిట్ కంపల్సరీ అనే పరిస్థితిలో ఉంది. అందుకే డైరెక్టర్ క్రిష్ సినిమా పై భారీ ఆశలే పెట్టుకుంది. అలాగే హిందీలో సినిమాలతో.. తమిళంలో పాన్ ఇండియా మూవీ ఇండియన్-2 తో పాటు టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ సరసన అయలన్ సినిమాలు చేస్తోంది. మొత్తానికి రకుల్ ప్రీత్ టైం ఫుల్ స్వింగ్ లో ఉంది. తాజాగా అమ్మడు మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అదికూడా బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్ సరసన సినిమా అంటే రకుల్ మాములు హ్యాపీ కాదు.

అక్షయ్ కుమార్ తో బెల్ బాటమ్ సినిమా తెరకెక్కించిన దర్శకుడు రంజిత్ తివారి.. తదుపరి సినిమా కూడా ఆక్షయ్ తోనే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈసారి అక్షయ్ కుమార్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఓకే అయినట్లు కథనాలు చెబుతున్నాయి. మొన్నటివరకు ఈ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ బ్యూటీస్ కియారా అద్వానీ.. శ్రద్ధాకపూర్ పేర్లు వినిపించాయి. కానీ చివరిగా అవకాశం రకుల్ ను వరించినట్లుగా బాలీవుడ్ వర్గాలలో టాక్. జిక్కి భగ్నని నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలోగా పట్టాలెక్కానుందని సమాచారం. ప్రస్తుతం మేకర్స్ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారట. అయితే ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో హిట్స్ లేకపోయినా అవకాశాలు మాత్రం దక్కించుకుంటుంది. ప్రస్తుతం వయ్యారి చేతిలో మేడే.. థాంక్ గాడ్.. డాక్టర్ జి.. ఛత్రీవాలి సినిమాలున్నాయి. అలాగే ఇప్పుడు అక్షయ్ కుమార్ మూవీ.. మరి ఈ లెక్కన అమ్మడు త్వరలో బాలీవుడ్ లో స్టార్డం అందుకోవడం ఖాయమే అనిపిస్తుంది.
Tags:    

Similar News