బ్రదర్స్ ను చుట్టేస్తున్నావా రకుల్ పాపా

Update: 2017-03-07 05:39 GMT
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాగా బిజ్జీ అనే సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు చేసేయడం.. సక్సెస్ లు సాధించేయడం ఈ భామకు బాగా అలవాటు అయిపోయింది. గతేడాది నాన్నకు ప్రేమతో.. సరైనోడు.. ధృవలతో మూడు సూపర్ హిట్స్ పట్టేసిందంటే.. ఈ భామ ట్యాలెంట్ అర్ధమవుతుంది.

రీసెంట్ గా విన్నర్ అంటూ సాయి ధరం తేజ్ తో విన్నర్ మూవీని ఫినిష్ చేసిన రకుల్.. ప్రస్తుతం కోలీవుడ్ హీరో కార్తితో కలిసి ధీరన్ అధికారం ఒండ్రు అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే దాదాపు షూటింగ్ ఫినిష్ చేసుకోగా.. ఏప్రిల్ నెలలో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. మరోవైపు.. సూర్యతోనూ సినిమా ఛాన్స్ ఈమె దక్కించుకుందని కోలీవుడ్ జనాలు అంటున్నారు. త్వరలో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య ఓ మూవీ చేయనున్నాడు. ఇందులో హీరోయిన్ ఆఫర్ రకుల్ ప్రీత్ చేతిలోనే పెట్టినట్లు కోలీవుడ్ టాక్.

కోలీవుడ్ బ్రదర్స్ ఇద్దరినీ రకుల్ ప్రీత్ సింగ్ చుట్టేస్తోందన్న మాట. ఇక్కడ మెగా ఫ్యామిలీలో కూడా రామ్ చరణ్.. అల్లు అర్జున్.. సాయిధరం తేజ్ లను కవర్ చేసేసిన రకుల్.. అక్కడికెళ్లి సూర్య-కార్తిలను చుట్టేస్తోంది. ఒక ఫ్యామిలీలో ఒకరు ఛాన్స్ ఇస్తే.. ఆ ఇంట్లో ఉన్న మిగిలిన హీరోలను కూడా కవర్ చేసేయడం చూస్తే.. రకుల్ ట్యాలెంట్ ఏంటో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News