నాకు కాబోయేవాడు అలా చేస్తే చాలు

Update: 2020-05-14 13:06 GMT
ఈ మధ్యే రకుల్ ప్రీత్ సింగ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. 'నా కూతురు రకుల్ ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉంటోంది. ఎంతకాలం సినిమాలు చేస్తుందో చేయనిస్తాం.. తన పెళ్ళికి పెద్దగా తొందరేం లేదు. తను ఎప్పుడు పెళ్ళికి సిద్ధం అవుతుందో.. అప్పుడే తను కోరుకున్న కుర్రాడిని ఇచ్చి పెళ్లి చేస్తాం..' అంటూ చెప్పిన విషయం మరవక ముందే.. స్టార్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎట్ట‌కేల‌కి త‌న పెళ్లి గురించి పెదవి విప్పింది. తనకు కావాల్సిన భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో వివ‌రించింది. లాక్‌డౌన్ టైంలో మంచు ల‌క్ష్మీతో ఇంస్టాగ్రామ్ లైవ్‌ వీడియో చాట్ లో పాల్గొన్న రకుల్.. మంచు లక్ష్మి అడిగిన అనేక‌ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లకు సమాధానాలు చెప్పింది. ఇందులో ర‌కుల్ పెళ్లికి సంబంధించిన టాపిక్ కూడా అడిగింది లక్ష్మి. ఇక రకుల్ మాట్లాడుతూ..

కాబోయే వ‌రుడి గురించి గ‌తంలో నా ద‌గ్గ‌ర చాటంత లిస్ట్ ఉండేది. కాని ఇప్పుడు నేను చేసుకోబోయే వాడు అబ్బాయి అయితే చాలు అని న‌వ్వ‌కుంటూ.. క్వాలిటీస్ గురించి చెప్పింది. నాకు అందగాడు అవసరంలేదు. జీవితాన్ని సాఫీగా ముందుకు నడిపేవాడు.. నా పని మీద ఇష్టం గౌరవం ఉన్నవాడు కావాలని చెప్పింది. ఇంకా బుద్ధిమంతుడు, తెలివైన వాడు అయ్యి ఉండ‌టం చాలా ముఖ్యమని చెప్పింది కూడా.. ఆ తర్వాత ఫిట్‌నెస్‌కి సంబంధించిన విష‌యాలు కూడా మాట్లాడిన రకుల్.. త‌న‌కి చిన్న‌ప్ప‌టి నుండి గేమ్స్ ఆడ‌డం ఇష్టం. 18 ఏళ్ళ వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు మొద‌లు పెట్టిన వర్కౌట్స్ ఇప్పుడు లైఫ్‌లో భాగం అయిపోయాయని చెప్పుకొచ్చింది. తెలుగు తమిళ హిందీ బాషలలో సత్తా చాటుతున్న ర‌కుల్ ప్రస్తుతం చేతిలో అరడజను సినిమాలతో బిజీగా ఉంది.
Tags:    

Similar News