రకుల్ ఏం చెబుతోందంటే..

Update: 2018-03-23 06:01 GMT
జీవితంలో గెలవడం అంత ఈజీ కాదు అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ ఓటమి కూడా ఒక పాఠమే అనే ఆలోచన అందరికి అంత ఈజీగా తెలియదు. గెలవాలంటే ఎన్నో సార్లు ఓడిపోవాలి. గెలుపోటములు సహజం అని రోజు ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు. రీసెంట్ గా మాత్రం ఎక్కువగా రకుల్ జీవిత సత్యాన్ని తనదైన శైలిలో తెలుపడానికి ప్రయత్నం చేసింది. అమ్మడు గత కొంత కాలంగా వరుస అపజయాలను చూస్తోన్న సంగతి తెలిసిందే.

స్పైడర్ చిత్రం డిజాస్టర్ అవ్వడంతో రకుల్ కి తెలుగులో ఒక్క ఛాన్స్ రాలేదు. బాలీవుడ్ లో అంతకుముందు ఒకే చేసిన అయ్యారీ  సినిమా చేసిన పెద్దగా హిట్ అవ్వలేదు. కార్తితో చేసిన తమిళ సినిమా మాత్రం కోలీవుడ్ లో అవకాశాలను అందిస్తోంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ గెలుపోటముల గురించి వివరణ ఇచ్చింది. ఫెయిల్యూర్స్ అనేవి లైఫ్ లో విజయానికి పిల్లర్స్ లాంటివి. ఫెయిల్యూర్స్ లేకుంటే సక్సెస్ కి విలువ ఉండదు. ఓడినవారికే గెలుపు గురించి ఎక్కువగా తెలుస్తుంది. అలాగే జీవితంలో సమర్ధవంతంగా నిలదొక్కుకోవడానికి ఓటములు ఉపయోగపడతాయని రకుల్ తన స్టైల్ లో వివరించింది.

ఇక తన అఫీషియల్ యాప్ ని రకుల్ ఇటీవల రిలీజ్ చేసింది. అందులో రకుల్ కి సంబందించిన అప్డేట్స్ తో పాటు నాలుగు మంచి మాటలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయట. ఇక ప్రస్తుతం రకుల్ కోలీవుడ్ లో మూడు సినిమాలను బాలీవుడ్ లో ఒక సినిమాను చేస్తోంది.  
Tags:    

Similar News