కరోనా ఎఫెక్ట్: ఇంట్లోనే భామల యోగాసనాలు
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఒణికిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో అన్నిచోట్లా హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. సినీ తారలు సైతం షూటింగ్ లకు గుడ్ బాయ్ చెప్పేసి ఇంట్లో ఫ్యామిలీలతో గడుపుతున్నారు. మరి కొంత మంది కథానాయికలు ఫిట్ నెస్ వర్కౌట్స్ చేస్తూ రోజుకో పోస్ట్ ని.. వీడియోలను తమ సోషల్‌మీడియా అకౌంట్ల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. నిన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఆదాశర్మ.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి నటీమణులు ఇంట్లోనే యోగా- ఎక్సర్‌సైజ్ లు చేస్తూ తమ వంతు సామాజిక బాధ్యతని చాటుకుంటున్నారు. అంతేకాదు ఇలాంటి వైరస్ ల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఇలాంటి వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయని సందేశాలించారు. తాజాగా కత్రీనా కైఫ్- కరీనా కపూర్ వంటి భామలు కూడా ఎక్సర్ సైజ్ లతో కూడిన పోస్ట్ లు పెట్టారు. మనం నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటి యోగా.. వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
మరోవైపు కత్రిన గిటార్ వాయిస్తూ ఓ వీడియోని పంచుకుంది. త్వరలో తనలోని మరోకోణాన్ని ఆవిష్కరించబోతున్నట్టు వెల్లడించారు. ఇక దీపికా పదుకొనె- అనుష్క శర్మ వంటి కథానాయికలు `సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్` మూవ్‌మెంట్ కి శ్రీకారం చుట్టారు. మిగిలిన వారంతా సోషల్ మీడియాలో కరోనాకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సందేశాలిస్తున్నారు. ఇక మరికొంత మంది ఇవేమీ మాకు పట్టవన్నట్టు ఎప్పటిలాగే ఘాటైన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాని విపరీతంగా వాడుకుంటున్నారు. నెటిజనుల్లో హీట్ పెంచుతున్నారు.
తెలుగు సినీపరిశ్రమలో టాప్ స్టార్లు అంతా ఇళ్లకే అంకితమై కుటుంబ సమేతంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూస్తున్నారు. బిజీ లైఫ్ లో చూడాలనుకుని మిస్సయిన వాటిని డీవీడీలు తెప్పించుకుని మరీ చూస్తున్నారట. అమెజాన్- నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ మాధ్యమాలకు అడిక్ట్ అవుతున్నారు. పలువురు హీరోలు కథలు వింటూ కొత్త ట్యాలెంటుని ఆహ్వానిస్తున్నారు. కరోనా కల్లోలం ఇలా సెలబ్ లైఫ్ ని ఛేంజ్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.