సీనియ‌ర్ బ్యూటీ సోష‌ల్ మీడియా సంపాద‌న అవాక్కు!

సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదిక‌గాను తమన్నా సంపాదన, క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రమ్‌లో త‌మ‌న్నాకు ఏకంగా 2.8 కోట్ల (28 మిలియన్లు) మంది ఫాలోవర్లు ఉన్నారు.

Update: 2026-06-30 03:56 GMT

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా గ్లామర్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గ్లామ‌ర్ పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటినా.. నేటికీ అదే బ్యూటీ, అదే ఎనర్జీతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది ఈ సీనియర్ భామ‌. 2004లో `చాంద్ కా రోషన్ చెహ్రా` అనే హిందీ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన తమన్నా.. ఆ తర్వాత 2005లో మంచు మనోజ్ సరసన `శ్రీ` సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. అలా మొదలైన ఈ మిల్కీ బ్యూటీ ప్రస్థానం 22 ఏళ్లుగా న‌ట‌నా కెరీర్ ప‌రంగా దిగ్విజయంగా కొనసాగుతోంది.

సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియా వేదిక‌గాను తమన్నా సంపాదన, క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రమ్‌లో త‌మ‌న్నాకు ఏకంగా 2.8 కోట్ల (28 మిలియన్లు) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ రేంజ్ ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో అత్యధిక ఆదరణ కలిగిన టాలీవుడ్ - బాలీవుడ్ స్టార్స్‌లో ఒకరిగా దూసుకుపోతోంది. తమన్నా షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతూ మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతోంది.

కేవలం ఫోటోలు, వీడియోలకే పరిమితం కాకుండా ఈ ఇన్‌స్టాగ్రమ్ క్రేజ్‌ను తమన్నా భారీగా క్యాష్ చేసుకుంటోంది. బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఈ బ్యూటీ సంపాదిస్తున్న అంకెలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇన్‌స్టాగ్రమ్‌లో చేసే ఒక్కో ప్రమోషనల్ పోస్ట్ లేదా ఎండార్స్‌మెంట్‌కు తమన్నా సగటున రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు భారీగా చార్జ్ చేస్తోంది. మిల్కీ బ్యూటీకి ఉన్న‌ యూత్ ఫాలోయింగ్ - గ్లామర్, డ్యాన్సింగ్ స్కిల్ కార‌ణంగా బ్రాండ్లు తమ సేల్స్ పెంచుకోవడానికి తమన్నాతో ప్రమోషన్లు చేయించడానికి క్యూ కడుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే... సీనియర్ హీరోయిన్ అయినా రెమ్యునరేషన్ విషయంలో తమన్నా నేటి తరం యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం సౌత్ (టాలీవుడ్, కోలీవుడ్) లో ఒక్కో సినిమాకు ఈమె రూ. 2 నుండి 3 కోట్ల రేంజ్ లో వసూలు చేస్తోంది. అదే బాలీవుడ్ (హిందీ) ప్రాజెక్టుల విషయానికి వస్తే..అక్కడ ఉన్న మార్కెట్ క్రేజ్ దృష్ట్యా ఒక్కో చిత్రానికి ఏకంగా రూ. 3 నుండి 4 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ తన హవా కొనసాగిస్తోంది.

రెండు దశాబ్దాల కెరీర్‌లో ఎందరో హీరోయిన్లు వచ్చి వెళ్లినా... తమన్నా భాటియా బ్రాండ్ వాల్యూ మాత్రం తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గ్లామర్ రంగంలో ఇన్నేళ్లుగా టాప్ పొజిషన్‌లో కొనసాగడం ఒక్క తమన్నాకే సాధ్యమైందని పరిశ్రమ వర్గాలు అంటుంటాయి. సినిమాల రెమ్యునరేషన్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా ప్రమోషన్ల ద్వారా ఈ మిల్కీ బ్యూటీ సంపాదనలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

కెరీర్ విషయానికి వస్తే.. తమన్నా భాటియా ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో అత్యంత బిజీగా గడుపుతోంది. బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న `వీ-వన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్`తో పాటు, ప్రతిష్టాత్మక వి.శాంతారామ్ బయోపిక్‌లోనూ త‌మ‌న్నా కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే హారర్ ఫ్రాంచైజీ `రాగిణి ఎంఎంఎస్ 3` ..దర్శకుడు జగన్ శక్తి తెరకెక్కిస్తున్న రెండు క్రేజీ చిత్రాలలోనూ నటిస్తూ హిందీలో తన హవా కొనసాగిస్తోంది. వీటితో పాటు సౌత్‌లోనూ తన క్రేజ్ తగ్గకుండా తమిళంలో యాక్షన్ హీరో విశాల్ సరసన `పురుషన్` అనే చిత్రంలో నటిస్తూ మరికొన్ని భారీ సౌత్ ఇండియన్ ప్రాజెక్టులతో రెండు దశాబ్దాల తర్వాత కూడా మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా దూసుకుపోతోంది.

Tags:    

Similar News