ర‌కుల్ జీరోసైజ్ సీక్రెట్ కాస్త చెప్ప‌మ్మా?

Update: 2022-04-22 02:30 GMT
ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో కెరీర్ ని బిల్డ్ చేసుకునే ప‌నిలో ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొన్నాళ్ల‌గా హిందీ సినిమాల‌పై నే దృష్టి పెట్టి ప‌నిచేస్తోంది. మీడియం రేంజ్ హీరోల‌తో అవ‌కాశాలు అందుకుంటూ బాగానే సినిమాలు చేస్తోంది. ఇందులో చెప్పుకోద‌గ్గ సినిమా `ర‌న్ వే  34`. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌స‌న న‌టించింది. త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్ అవుతోన్న నేప‌థ్యంలో కొద్ది  రోజులుగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో బిజీగా గ‌డుపుతోంది.

అజ‌య్ తో క‌లిసి అన్ని ప్రాంతాలు చుట్టేస్తుంది. ఇక బ్యూటీ కెమెరా యాంగిల్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఏప్రెస్ మీట్ కి హాజరైనా..ఇబ్బ‌డి ముబ్బ‌డిగా  ఫోజులిస్తుంది. వాటిలో కొన్నింటిని  నెట్టింట తానే స్వ‌యంగా షేర్ చేస్తోంది. రోజ్ క‌ల‌ర్  ఔట్ ఫిట్ దుస్తుల్లో ర‌కుల్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. అయితే ఈ దుస్తులు ర‌కుల్ కి కాస్త లూజుగా క‌నిపిస్తున్నాయి. ఇక్క‌డే ర‌కుల్ లో మార్పులు గ‌మ‌నించ‌వ‌చ్చు.

ర‌కుల్ ఇప్ప‌టికే స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. ఫిట్ నెస్ ప్ర‌క్రియ‌లో భాగంగా బాగా స‌న్నబ‌డింది. తాజా లుక్ లో ఏకంగా జీరోసైజ్ లోకే మారిపోయినట్లు క‌నిపిస్తుంది. శ‌రీరంలో టాప్ టూ బాట‌మ్ అనూహ్య‌మైన మార్పులు గ‌మ‌నించ‌వ‌చ్చు. ఎక్క‌డా ఫేట్ క‌నిపించ‌లేదు. పూర్తిగా జీరో సైజ్ లో క‌నిపిస్తుంది. ముఖంలో ఆ మార్పులు స్పష్టంగా  క‌నిపిస్తున్నాయి.

మ‌రి  ర‌కుల్ ఇంత స‌న్న‌జాజిలో మారిపోవ‌డం వెనుక సీక్రెట్ ఏదైనా ఉందా? అంటే బాలీవుడ్ లో నిల‌దొక్కుకోవ‌డం కోస‌మే ఇలాంటి జీరో లుక్ మెయింటెన్ చేస్తుందా? అన్న సందేహం స‌హ‌జం. బాలీవుడ్ లో  చ‌బ్బీ లుక్ ఏమాత్రం వ‌ర్కౌట్ కాదు. అక్క‌డ స్లిమ్ లుక్ త‌ప్ప‌ని స‌రి. కానీ ర‌కుల్ అంత‌కు మించి వ‌ర్కౌట్లు చేస్తుంది.

ప్ర‌స్తుతం ఈ కొత్త ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ర‌కుల్ లుక్ పై ఫ్యాన్స్  లో సైతం చ‌ర్చ‌కొచ్చింది. ఇక రకుల్ కోలీవుడ్ లో `ఇండియ‌న్ -2`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News