ఫోటోటాక్: సీక్విన్ ట్రెండ్ లో ర‌కుల్ ధ‌గ‌ధ‌గ‌లు

Update: 2022-03-23 16:30 GMT
ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్  టెంప్టింగ్ ఎలివేష‌న్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న‌దైన గ్లామ్ షో తో ఇన్ స్టాని హీటెక్కించ‌డం బ్యూటీలో మ‌రో ప్ర‌త్యేక‌త‌. డిజైన‌ర్ వేర్స్ తో పాటు..అవ‌స‌రం మేర హ‌ద్దులు మీరిన దుస్తుల్లో కాక‌లు రేపుతుంది. తాజాగా బ్యూటీ గార్జియ‌స్ గ్లేజీ లుక్ లో ఆక‌ట్టుకుంటుంది.  నాచు రంగు మకుముల్ల  బ్యాక్ డ్రాప్ లో డిజైన‌ర్ దుస్తుల్లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం డిజైనర్ దుస్తుల్లో  సీక్విన్ ట్రెండ్ కొన‌సాగుతోంది.

దీంతో ర‌కుల్ కూడా సీక్విన్స్ తో మెరిసే మెటీరియ‌ల్నే ఎంపిక చేసింది. బాడీ కాన్ స్క‌ర్ట్ తో కూడిన  స్ర్టాపీ క్రాప్ టాప్ ధ‌రించింది. మ్యాచింగ్ యాక్స‌ర‌సీస్ తో ఆక‌ట్టుకుంటుంది. బ్లింగ్ చెవిపోగులు..బ్రాస్ లెట్.. ర‌కుల్ లో గ్లోని మ‌రింత హైలైట్ చేస్తున్నాయి. కాంస్య  టోన్ మేక‌ప్ లో మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.  క్లోజ్ అప్ షాట్ ల్  క్యూట్ స్మైల్ ర‌కుల్ ని మ‌రింత అందంగా ఎలివేట్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. అభిమానులు బ్యూటీ స్ట‌న్నింగ్ లు క్ పై హాట్ కామెంట్లు గుప్పిస్తున్నారు.

ఇక ర‌కుల్ సినిమాల విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లో న‌టిగా బిజీగా ఉంది. `డాక్ట‌ర్ జీ` అనే  సినిమాలో న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది.  అలాగే `ఛ‌త్ర‌వాలీ` అనే మ‌రో సినిమాలో  కూడా న‌టిస్తోంది. ఇది షూటింగ్ ద‌శ‌లో ఉంది. `ఎటాక్`..`ర‌న్ వే`..`థాంక్ గాడ్`..`మిష‌న్ సిండ్రాల్లా న‌టిస్తోంది`. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి.

ఇక కోలీవుడ్ లో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ఇండియ‌న్ -2`లో న‌టిస్తోంది. ఈ సినిమాపై ర‌కుల్ చాలా ఆశ‌లు పెట్టుకుంది.  తెలుగులో `31 అక్టోబ‌ర్  లేడీస నైట్` లో న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..త‌మిళ్ లో తెర‌కెక్కిస్తున్నారు.  టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల్లో అవ‌కాశాలు ఇవ్వాల‌ని  ఆమ‌ధ్య‌ బ‌హిరంగానే కోరిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News