ఫోటోటాక్‌ : మళ్లీ సంద్రంను మించి అందాల ఆరబోత

Update: 2022-02-27 11:38 GMT
సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్ గా ఓ రేంజ్ లో వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తెలుగు లో ఈమె దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించేసింది. తమిళంలో కూడా దిగ్గజ నటులతో నటించింది. హీరోయిన్ గా సౌత్‌ లో పీక్స్ కు వెళ్లిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు బాలీవుడ్‌ లో సందడి చేస్తోంది. సౌత్‌ లో కాస్త డల్‌ అవ్వడంతో వెంటనే బాలీవుడ్‌ కు వెళ్లింది. అక్కడ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది.

బాలీవుడ్‌ లో రాబోయే రెండేళ్లలో పది సినిమాల కంటే ఎక్కువ సినిమాలను విడుదల చేయబోతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్ సౌత్‌ లో కూడా మళ్లీ బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. పాన్ ఇండియా సినిమాలకు ది బెస్ట్‌ చాయిస్ తాను అంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా ఇన్‌ స్టా లో హాట్‌ ఫోటోల షేరింగ్‌ అదే స్థాయిలో ఉంటుందని రకుల్‌ మరోసారి నిరూపించింది.

ఇన్‌ స్టా గ్రామ్‌ లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు తన హాట్‌ ఫోటో షూట్స్ ను రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈమె తన హాట్‌ ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షిచింది. గతంలో పలు సార్లు సముద్రం ఒడ్డున అందాల ఆరబోత ఫోటోలను అభిమానులతో షేర్‌ చేసుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇప్పుడు మరోసారి ఎల్లో లో ట్రెండీ డ్రస్ లో సముద్రం ఒడ్డున అందాల ఆరబోత చేసింది.

సముద్రం అందం ముందు ఇతర అందాలన్నీ కూడా దిగదుడుపే అంటారు. కాని రకుల్‌ అందం ముందు సముద్రం చిన్నబోయిందా అన్నట్లుగా అనిపిస్తుంది. రకుల్‌ సముద్రం ముందు ఉండగా ఆమె మాత్రమే కనిపిస్తుంది కాని సముద్రం కనిపించడం లేదు.. అయినా సముద్రం ను కనీసం చూడాలని కూడా అనుకోవడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రకుల్‌ ప్రస్తుతం ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ఈమె చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా మంచి ఆఫర్లు వస్తున్న కారణంగా కాస్త ఆలస్యంగానే రకుల్‌ పెళ్లి ఉండే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News