కరోనా పానీయం తయారీ తెలిపిన హీరోయిన్ రకుల్

Update: 2020-04-21 16:42 GMT
సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందమే కాదు ఆరోగ్యం విషయంలో చాలా పకడ్బందీగా కేర్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో సాటి హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ మనదేశంలో విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారికి విరుగుడుగా ఓ పానీయాన్ని అభిమానులకు సూచిస్తుంది. ఇంతకీ రకుల్ తయారుచేసిన డ్రింక్ ఏంటంటే.. మార్కెట్‌ లో ఎన్ని రకాల హెల్త్ - ఎనర్జీ డ్రింకులు ఉన్నా.. సహజ సిద్ధంగా తయారు చేసుకొనే పానీయాలే ఆరోగ్యానికి మేలు అని నానాటిగా వింటున్న మంచిమాట.

ప్రస్తుతం లాక్‌ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రకుల్ నేచురల్‌ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ చిట్కాను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రకుల్ ఆ పానీయం గురించి వివరిస్తూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి లభించే పదార్థాలను - పానీయాలను సేవించాలి. నాకు నా ఫ్రెండ్ రాశీ చౌదరీ ఈ డ్రింక్ తయారు చేసుకొనే విధానాన్ని చెప్పింది. ఇది ఇప్పటి పరిస్థితులకే కాకుండా ఎప్పుడూ ఇలాంటి పానీయం సేవిస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుందని వెల్లడిస్తుంది అమ్మడు.

మరి ఆరోగ్యాన్ని కాపాడే ఆ సహజ సిద్ధమైన పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవేనట. అరలీటరు నీరు - అందులోకి సరిపోయేంత అల్లం - మిరియాలు - పసుపు - లవంగాలు - దాల్చిన చెక్క పాత్రలో వేసుకొని మరగ బెట్టుకోవాలి. దానికి ఆర్గానిక్ తేనే కలిపి తాగితే కెఫిన్ ఉండే కాఫీ కంటే మంచి రుచిని కలిగి ఉంటుంది అని రకుల్ చెప్పుకొచ్చింది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. శరీర పటుత్వంపై దృష్టిపెట్టాలి. మానసికంగా.. శారీరకంగా దృఢంగా ఉండాలి. దాదాపుగా ఇంటి ఫుడ్ నే తినండి అంటూ రకుల్ తన సందేశాన్ని పంచుకుంది. ప్రస్తుతం రకుల్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
   

Tags:    

Similar News