నయనిక ఎక్స్ ప్రెషన్స్.. శిరీష్ భలే క్యాప్చర్ చేశారే..

ఇక తాజాగా అల్లు శిరీష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది.;

Update: 2026-03-22 04:49 GMT

యంగ్ హీరో అల్లు శిరీష్ తాజాగా తన వ్యక్తిగత జీవితంతో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌ గా మారుతున్నారు. ఇటీవల ఆయన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. శిరీష్ భార్య నయనిక రెడ్డి కూడా ఇప్పుడు నెటిజన్ల దృష్టి ఆకర్షిస్తున్నారు. పెళ్లి తర్వాత ఆ జంట కొన్నిరోజులుగా పబ్లిక్‌ గా కలిసి కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ముంబైలో జరిగిన ప్రతిష్టాత్మక లాక్మే ఫ్యాషన్ వీక్ 2026లో అల్లు శిరీష్- నయనిక జంట కలిసి పాల్గొన్నారు. ఇది కొత్త జంట తొలి పబ్లిక్ అప్పియరెన్స్ కావడంతో అందరి దృష్టి వారిపై నిలిచింది. అయితే నయనిక షోను చాలా ఫోకస్‌తో చూస్తూ ఉండగా, ఆమె ముఖంలో కనిపించిన ఎక్స్ ప్రెషన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. 

దీంతో కొందరు నేచరుల్ ఎక్స్ ప్రెషన్స్ అంటూ కామెంట్స్ పెట్టగా.. మరికొందరు ట్రోల్స్ చేశారు. వాటిని చూసిన శిరీష్.. నవ్వుకున్నారేమో మరి. తాజాగా నయనిక ఎక్స్ ప్రెషన్స్ ను మొబైల్ లో క్యాప్చర్ చేసి వీడియో పోస్ట్ చేశారు. అంతే కాదు.. ఎప్పుడూ ఫోకస్ తోనే.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో నయనిక ఎల్లప్పుడూ శ్రద్ధతో చూస్తుంటుందని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు.

అయితే వీడియోలో శిరీష్, నయనిక కలిసి ఏదో సినిమాను థియేటర్స్ లో చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. సినిమాలో పూర్తిగా లీనమై ఉన్న నయనికను శిరీష్ సరదాగా వీడియో తీస్తారు. ఆ సమయంలో ఆమె ఒక్కసారిగా గమనించి నవ్వేసిన మూమెంట్ చాలా నేచురల్ గా కనిపించింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నేచురల్ ఎక్స్ ప్రెషన్స్, రియల్ కెమిస్ట్రీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక అల్లు శిరీష్- నయనికల ప్రేమకథ ఆసక్తికరంగా సాగింది. కొన్నాళ్ల పాటు ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని సమాచారం. నయనిక, హీరో నితిన్ భార్య శాలినికి మంచి స్నేహితురాలు. ఆ పరిచయం ద్వారానే శిరీష్‌ కు నయనికతో మొదటి పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా వరుణ్ తేజ్- లావణ్య వివాహ వేడుకల సందర్భంగా జరిగిన పార్టీ ఆ పరిచయానికి కారణమైంది.

ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి, తర్వాత ప్రేమగా మారింది. చివరికి పెద్దలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి తర్వాత కూడా శిరీష్, నయనిక సింపుల్‌ గా, ఆనందంగా గడుపుతున్న తీరు అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు శిరీష్ పోస్ట్ చేసిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News