అనిరుధ్ కన్సర్ట్.. 'జై బాబు' అంటున్న సితార

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సూపర్ మూమెంట్ అంటూ మహేష్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఇక ఆ కన్సర్ట్ కు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.;

Update: 2026-03-22 08:59 GMT

హైదరాబాద్‌ లో యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తొలిసారిగా నిర్వహించిన లైవ్ కన్సర్ట్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. అనిరుధ్ ఎక్స్ వీ (15 ఇయర్స్ విత్ యూ) పేరుతో జరిగిన ఆ మ్యూజిక్ ఈవెంట్ భారీగా అభిమానులను ఆకర్షించింది. సిటీలోని ఫేమస్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఆ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలి వచ్చారు.

కన్సర్ట్ లో మొదటి నుంచి చివరి వరకు.. ఓ రేంజ్ లో సందడి కనిపించింది. అనిరుధ్ తన కెరీర్‌ లోని పలు హిట్ పాటలను వరుసగా ఆలపించగా, ప్రేక్షకులు ప్రతి సాంగ్ కు కూడా చప్పట్లు, స్లోగన్స్ తో స్పందించారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఆయన పాడిన పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులు సాంగ్స్ కు తగ్గట్టు కోరస్ ఇవ్వడం, డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అదే సమయంలో కన్సర్ట్‌ లో మరో స్పెషల్ మూమెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని కూడా ఈవెంట్ కు వచ్చింది. సాధారణ అభిమానిలా ఆమె లైవ్ కన్సర్ట్ ను ఆస్వాదించింది. ఒక సందర్భంలో మహేష్ ఫ్యాన్స్ నినాదాలు చేస్తుండగా, సితార వారితో కలిసి జై బాబు అంటూ నినదించడం ఇప్పుడు వైరల్ గా మారింది.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సూపర్ మూమెంట్ అంటూ మహేష్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఇక ఆ కన్సర్ట్ కు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. నేచురల్ స్టార్ నాని తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి పాల్గొన్నారు. అనిరుధ్ తన రాబోయే చిత్రం ది ప్యారడైజ్ లోని ఆయా షేర్ సాంగ్ ను పాడిన సమయంలో నాని ఉత్సాహం వ్యక్తం చేశారు.

ప్రేక్షకులతో కలిసి చప్పట్లు కొడుతూ, పాటకు తగినట్లుగా రెస్పాండ్ అయ్యారు. స్పాంటేనియస్ గా డ్యాన్స్ కూడా చేశారు. అలాగే తమిళ స్టార్ విజయ్ కు చెందిన నా రెడీ పాటను అనిరుధ్ ఆలపించినప్పుడు, ఆడియన్స్ ఫుల్ జోష్ తో ఊగిపోయారు. ఆ పాట సమయంలో ఈవెంట్ లో అందరి ఎనర్జీ హై లెవెల్ లో కనిపించింది. ఏదేమైనా ప్రతి సాంగ్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి.

మ్యూజిక్, లైటింగ్, స్టేజ్ ప్రెజెన్స్.. అన్నీ కలిసి కన్సర్ట్‌ ను ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ గా మార్చేశాయి. హైదరాబాద్‌ లో అనిరుధ్ రవిచందర్ తొలి లైవ్ కన్సర్ట్ కావడంతో అభిమానులు ఆ ఛాన్స్ ను వినియోగించుకున్నారు. ప్రస్తుతం అనిరుధ్ తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో వరుస ప్రాజెక్టులకు వర్క్ చేస్తున్నారు. ఆయా చిత్రాల వర్క్స్ తో బిజీగా ఉన్నా.. ఇప్పుడు కన్సర్ట్ ద్వారా సంగీత ప్రియులకు మరిచిపోలేని అనుభూతిని అందించారని చెప్పాలి.

Tags:    

Similar News