అతడు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినా? ఆలోచనలో మేకర్స్!
రవితేజ ఎనర్జీకి, జీవి ప్రకాష్ అందించే అదిరిపోయే బీట్స్‌కు ఈ అయ్యప్ప సాంగ్ తోడైతే? అది కేవలం పాటగా మాత్రమే కాకుండా ఒక పెద్ద సెలబ్రేషన్‌లా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.;
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో `ఇరుముడి` అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత శివ నిర్వాణ కెప్టెన్ కుర్చీ ఎక్కిన చిత్రమిది. వరుస పరజాయాల నేపథ్యంలో ఇరుముడితో మంచి హిట్ అందుకోవాలని ఎదురు చూస్తున్నాడు. అటు రవితేజ పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడి టైటిల్ తో తెరకెక్కుతున్నసినిమాతోనైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశీస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
పాత తరం భక్తి పాటల్లో ఎంతో ప్రజధారణ పొందిన `ఎక్కినాడు పల్లకి అయ్యప్ప` అనే ఐకానిక్ సాంగ్‌ను చిత్రంలో రీమిక్స్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ రీమిక్స్ గనుక నిజమైతే? థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ కుమార్ పని చేస్తున్నాడు. ఈ రీమిక్స్ విషయంలో జీవీ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఉన్నాడు. ఒరిజినల్ సాంగ్ లోని ఆత్మ దెబ్బతినకుండా, నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా భారీ ఎత్తున రీమిక్స్ చేయడానికి ఇప్పటికే ఒక ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నాడు.
రవితేజ ఎనర్జీకి, జీవి ప్రకాష్ అందించే అదిరిపోయే బీట్స్‌కు ఈ అయ్యప్ప సాంగ్ తోడైతే? అది కేవలం పాటగా మాత్రమే కాకుండా ఒక పెద్ద సెలబ్రేషన్‌లా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ రీమిక్స్ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం దర్శక,నిర్మాతలే. తుది నిర్ణయం మాత్రం దర్శకుడు శివ నిర్వాణ చేతుల్లోనే ఉంది. కథా పరంగా ఈ పాట ఏ సందర్భంలో వస్తుంది? భక్తి మరియు మాస్ ఎలిమెంట్స్ సరిగ్గా కుదురు తాయా? అన్న కోణంలో మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయ్యప్ప మాల ధరించిన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అత్యంత గౌరవప్రదంగా అంతే పవర్‌ఫుల్‌గా ఈ పాటను చిత్రీకరించాల్సి ఉంటుంది.
ఎక్కడా మెచ్చుతగ్గులు ఉండకూడదు. ఎంతో సెటిల్డ్ గా చేయాల్సి సాంగ్ ఇది. ఈ పాటకు సంబంధించిన రీమిక్స్ విషయంలోనూ జీవికీ అంతే బాధ్యత ఉంది. అందుకే దర్శక, నిర్మాతలు అన్ని కోణాలను విశ్లేషించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. రవితేజ సినిమాల్లో సాంగ్స్ అంటే ఎంతో ఎనర్జీ తో ఉంటాయి. అందులోనూ శివ గత చిత్రాల్లో సంగీతానికి పెద్ద పీట వేస్తాడు. అర్దవంతమైన ట్యూన్స్, సాహిత్యాన్నే కోరుకుంటాడు. అందులోనూ దేవుడుకు సంబంధించిన పాట అంటే శివ మరిన్ని జాగ్రత్తలు తీసుకునే ముందుకెళ్తాడు. ఈ విషయంలో ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోడు. అయ్యప్ప పాట గనుక సినిమాలో ఉంటే? అది సినిమా ప్రమోషన్లకు ఒక మేజర్ ప్లస్ పాయింట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.