వరుస ఫ్లాప్‌ లు వచ్చిన అమ్మడు ఫుల్‌ బిజీనే

Update: 2019-06-09 07:24 GMT
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లక్కీ హీరోయిన్‌ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మడు నటించిన సినిమాలు సక్సెస్‌ అయినా అవ్వకున్నా కూడా ఆఫర్లు అయితే తలుపు తడుతూనే ఉన్నాయి. ఈమద్య కాలంలో 'దే దే ప్యార్‌ దే' మినహా ఈ అమ్మడు నటించిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్‌ అవ్వలేదు. హిందీలో నటించిన దే దే ప్యార్‌ దే చిత్రం సక్సెస్‌ అవ్వడంతో హిందీలో కూడా ఈ అమ్మడికి డిమాండ్‌ పెరిగింది. తమిళంలో ఈ అమ్మడు వరుసగా ఫ్లాప్‌ లు చవి చూసింది. అయినా కూడా స్టార్‌ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

ప్రస్తుతం అట్లీ కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ ఒక సినిమాను చేస్తున్నాడు. దీపావళి కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రం విడుదలకు ముందే విజయ్‌ తదుపరి చిత్రం కనకరాజ్‌ లోకేష్‌ దర్శకత్వంలో అంటూ కన్ఫర్మ్‌ అయ్యింది. పలువురు స్టార్‌ దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే విజయ్‌ మాత్రం కనకరాజ్‌ చెప్పిన స్క్రిప్ట్‌ కు బెండ్‌ అయినట్లుగా తెలుస్తోంది. విజయ్‌ కుటుంబ సభ్యులే నిర్మించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ గా రకుల్‌ దాదాపుగా ఫైనల్‌ అయ్యింది.

తమిళంలో ప్రస్తుతం స్టార్‌ హీరోల్లో ముందు వరుసలో ఉండే విజయ్‌ సరసన నటించడం అంటే మామూలు విషయం కాదు. విజయ్‌ తో రకుల్‌ ఛాన్స్‌ దక్కించుకోవడంతో మరో రెండు మూడు సంవత్సరాల వరకు కెరీర్‌ ను నెట్టుకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి రకుల్‌ వరుసగా ఫ్లాప్స్‌ వస్తున్నా కూడా ఆఫర్లు దక్కించుకుంటూనే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. తెలుగులో కూడా ఈమె ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్‌ నుండి కూడా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News