వైష్ణవ్ తో కలిసి గొర్రెల్ని కాయడం నేర్చుకుందట
ఒకప్పుడు హీరోలు హీరోయిన్స్ చేసిన పాత్రలు ఇప్పటి హీరోలు మరియు హీరోయిన్స్ చేసేంత సాహసం చేయరు. ముఖ్యంగా అప్పటి హీరోయిన్స్ చాలా సినిమాల్లో డీ గ్లామర్ పాత్రల్లో నటించే వారు. కొందరు పల్లెటూరు అమ్మాయిలుగా పిల్ల తల్లులుగా నటించేవారు. కాని ఇప్పటి హీరోయిన్స్ కనీసం డీ గ్లామర్ రోల్ లో కూడా నటించేందుకు ఆసక్తి చూపించరు. ఎవరో ఒక్కరు ఇద్దరు పాత్రకు ప్రాముఖ్యత ఉంటే లేదంటే.. సినిమాలో ఆ పాత్ర బలంగా ఉంటే.. స్టార్ డైరెక్టర్ అయితే అప్పుడు కాని చేసేందుకు ఓకే చెప్తారు. డీ గ్లామర్ గా నటిస్తే ఆఫర్లు రావేమో అనే ఉద్దేశ్యంతో చాలా మంది హీరోయిన్స్ అలాంటి పాత్రలు చేయడానికి భయపడతారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కొండపొలం కోసం ఓబులమ్మ అనే ఒక డీ గ్లామర్ పల్లెటూరి గొర్లు కాసే అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది.
కొండ పొలం సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లుక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమె నటించేందుకు ఒప్పుకోవడం నిజంగా అభినందనీయం అంటూ అంతా అన్నారు. కొందరు మాత్రం రెండు సినిమాల ఏజ్ ఉన్న వైష్ణవ్ తేజ్ కు సీనియర్ హీరోయిన్.. మూడు పదుల వయసు ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ జత ఏంటీ అంటూ కామెంట్స్ చేశారు. పెద్ద ఎత్తున అంచనాలున్న కొండ పొలం సినిమాలో వైష్ణవ్ తో ఈ అమ్మడి జోడీ ట్రైలర్ విడుదల తర్వాత బాగుందనే టాక్ వచ్చింది. ట్రైలర్ విడుదలకు ముందు వరకు అంతా కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కాని ఇప్పుడు అందరి అనుమానాలు పటా పంచలు చేసే విధంగా ఇద్దరి లుక్ ఉందని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో గొర్ల కాపరిగా రకుల్ కనిపించబోతుంది. వైష్ణవ్ కూడా గొర్లను కాస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా గొర్లను కంట్రోల్ చేసేందుకు మూడు నాలుగు రోజుల పాటు కష్టపడ్డారట. ఆ తర్వాత ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయం ను నేర్చుకుని షూటింగ్ లో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు.
సినిమా కథ చెప్పడానికి రకుల్ ప్రీత్ సింగ్ ఇంటికి క్రిష్ వెళ్లిన సమయంలో ఆమె టీ షర్ట్ వేసుకుంది ఉందట. వైష్ణవ్ కోసం ఒక యంగ్ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు. యంగ్ గా ఉన్నావు అంటూ క్రిష్ కథ చెబుతున్న సమయంలో నాతో పలు సార్లు అన్నాడు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. మూడు పదుల వయసులో కూడా ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ పాతికేళ్ల లోపు అమ్మాయిగానే కనిపిస్తుంది. అందుకే ఈ అవకాశం ఆమెకు క్రిష్ ఇచ్చాడు. క్రిష్ నమ్మకంను నిలిపే విధంగా మేకప్ మరియు లుక్ పరంగా ఓబులమ్మ పాత్రకు రకుల్ పూర్తిగా సెట్ అయ్యిందని కామెంట్స్ వస్తున్నాయి. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని కూడా రకుల్ చాలా నమ్మకంతో చెబుతోంది.