ష్..! నయన్ ని ఫాలో అయ్యేంత ఉందా?
ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఆట ఆడటం ఎలానో రకుల్ నే అడగాలి. ఈ విషయంలో నాలుగు ఆకులు ఎక్కువే తింది ఈ పంజాబీ బ్యూటీ. ఓవైపు హిందీ పరిశ్రమలో ఏ అవకాశం వచ్చినా వదిలి పెట్టని ఈ భామకు అక్కడ ఎందుకనో లక్ కలిసి రావడం లేదు. స్టార్ హీరోలే ఛాన్సులిచ్చినా తనకు ఉపయోగపడడం లేదు. కనీసం అశిన్ - తాప్సీలా అయినా రాణించలేకపోతోంది. మినిమం ఇలియానాలా అయినా మ్యానేజ్ చేయలేకపోతోంది.
ఇటు సౌత్ లో పరిస్థితి అంతకంటే బెటర్ గా ఉందా? అంటే .. ఆ సీన్ ఇప్పుడు లేనే లేదు. నాగార్జున సరసన మన్మథుడు 2లో నటించిన ఈ అమ్మడికి ఆ తర్వాత అసలు అవకాశం ఇచ్చేవాళ్లే కరువయ్యారు. వరుసగా స్టార్ హీరోలతో నటించినా పరాజయాలు ఊపిరాడనివ్వలేదు. సక్సెస్ లేదు.. లక్ కలిసి రాలేదు. దీంతో రేసులో పూర్తిగా వెనకబడిపోయింది.
తెలుగు అయిపోయింది..! ఇంక ఇక్కడ పట్టించుకోవడం లేదు..! అందుకే తమిళ్ పై ఫోకస్ పెడితే బెటర్ అని రకుల్ ఫిక్సయిందట. తనకు ఇష్టమైన సౌత్ హీరోయిన్ నయనతార ని ఫాలో అయిపోతే బెటర్ అని రకుల్ ఫీల్ అవుతున్నట్లు సమాచారం. నయన్ కూడా తెలుగు లో ఓ వెలుగు వెలిగి తమిళ్ లోకి వెళ్లి అక్కడ ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. అయితే అందరికీ నయన్ లా కుదురుతుందా? అన్నదే అసలు పాయింట్. నయనతార స్టార్ డమ్ అసాధారణమైనది. రకుల్ అనవసరంగా కొరివితో తల గోక్కుంటుందేమో! అన్న కామెంట్లు పడిపోతున్నాయ్. బహుభాషా చిత్రం భారతీయుడు 2 మినహా ఈ అమ్మడికి చెప్పుకోదగ్గ అవకాశం ఎప్పటికి దక్కేనో!