రకుల్‌ మనసు దోచిన ఈ జాకీ ఎవరంటే..!

Update: 2021-10-11 03:30 GMT
టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్ గత దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూనే వస్తోంది. ఇప్పుడు కూడా తెలుగు.. తమిళం మరియు హిందీల్లో ఈమె సినిమాల్లో నటిస్తోంది. నేడు రకుల్‌ తన పుట్టిన రోజు సందర్బంగా ప్రియుడిని పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చింది. రకుల్ ప్రేమలో ఉందా అంటూ అంతా కూడా అవాక్కయ్యారు. రకుల్‌ ప్రేమను దక్కించుకున్న ఆ అందగాడు కమ్‌ తెలివైన ముఖ్యంగా లక్కీ పర్సన్ ఎవరు అంటూ అంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్ పరిచయం చేసిన వ్యక్తి పేరు జాకీ భగ్నానీ. ఇతడి గురించి తెలుసుకునేందుకు రకుల్‌ అభిమానులు మరియు సినీ జనాలు తెగ సెర్చ్‌ చేస్తున్నాడు. ఇంతకు ఈ జాకీ ఎవరు.. అతడు ఏం చేస్తాడు.. ఇద్దరికి ఎక్కడ పరిచయం.. ఇద్దరి ప్రేమ ఎన్నాళ్లుగా సాగుతోంది అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జాకీ బాలీవుడ్ హీరో. 2009 లోనే బాలీవుడ్‌ లో హీరోగా జాకీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ లను జాకీ దక్కించుకోలేక పోయాడు. హీరోలుగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత 2016 లో సరబ్జిత్‌ సినిమాతో నిర్మాతగా జాకీ మారాడు. ఐశ్వర్య రాయ్ మరియు రణదీప్‌ హుడాలు నటించిన ఆ సినిమా నిర్మాతగా జాకీకి మంచి పేరును తెచ్చి పెట్టింది. నిర్మాతగా మరియు నటుడిగా కంటిన్యూ అవుతున్న జాకీ భగ్నానీ ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఆ సినిమా లో రకుల్‌ ప్రీత్‌ సింగ్ హీరోయిన్ గా నటించబోతుంది. వీరిద్దరి మద్య పరిచయం ఎక్కడ.. ఎప్పటి నుండి వీరు ప్రేమలో ఉన్నారు అనే విషయమై ఇప్పటి వరకు బాలీవుడ్‌ మీడియా కూడా చెప్పలేక పోతుంది. వీరిద్దరు కలిసి చేసిన ప్రాజెక్ట్‌ లు కూడా పెద్దగా లేవు. అయినా కూడా ఇద్దరు కూడా మంచి బాండింగ్ తో ప్రేమలో పడటం అభినందనీయం అంటున్నారు.

జాకీ భగ్నానీ నటుడిగా మరియు నిర్మాతగా ఎంతగా కష్టపడుతాడో ఫిజిక్ విషయంలో కూడా అంతే కష్టపడుతాడు. ఇద్దరు కలిసి ఫిజికల్‌ ఫిట్ నెస్ గురించి ఎక్కువగా చర్చించుకుంటారేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాలీవుడ్ మీడియా సర్కిల్స్ వారు చర్చించుకుంటున్నారు. మొత్తానికి వీరిద్దరు ఏకం అవ్వబోతున్న నేపథ్యంలో అభిమానులు రెండు వైపుల అభినందిస్తున్నారు. జాకీ భగ్నానీ మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లు భవిష్యత్తులో కలిసి నటిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు మాత్రం జాకీ భగ్నానీ మంచి ట్యాలెంట్ వ్యక్తి. కాని అదృష్టం కలిసి రాకపోవడంతో హీరోగా సక్సెస్ అవ్వలేక పోయాడు. ఇప్పటి నుండి అయినా అతడి జీవితంలో అదృష్టం కలిసి వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News