• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంజు స్క్రిప్ట్ మార్చింది...

సంజు స్క్రిప్ట్ మార్చింది నిజమే!

By - Tupaki Desk
Update: 2018-09-14 10:43 GMT
ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో 'సంజు' ఒకటి.  సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకుడు రాజ్ కుమార్ హీరాని.  సంజయ్ పాత్రలో రణబీర్ కపూర్ నటించాడు.  సినిమా బ్లాక్ బస్టర్ అయింది రణబీర్ సింగ్ కు భారీ ప్రశంసలు దక్కాయి గానీ అగ్రదర్శకుడైన హీరానికి మాత్రం విమర్శలు తప్పలేదు.

సంజయ్ జీవితం లోని చీకటి కోణాలు చూపించినట్టే కలరింగ్ ఇచ్చి వాస్తవాలను దాచాడని.. అసలు సంజయ్ లైఫ్ లో తప్పేమీ లేదు అంతా విధి ప్రభావం అన్నట్టుగా షుగర్ కోటింగ్ ఇచ్చాడని చాలామంది ఘాటుగా విమర్శించారు. అసలు 1993 బాంబు బ్లాస్ట్ కేసు విషయం లో కూడా వాస్తవాలను చూపలేదని కూడా విమర్శలు ఉన్నాయి. కొంతమంది నెటిజనులయితే ఇక సల్మాన్ ఖాన్ కూడా 'సల్లు' అనే పేరుతో షుగర్ కోటింగ్ సినిమాను తీసేందుకు హీరాని ని సంప్రదించాడని - భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడని పంచ్ లు విసిరారు.  

రీసెంట్ గా హిరాని ఇండియన్ ఫిలిం అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్ మాస్టర్ క్లాస్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.  ఔత్సాహిక డైరెక్టర్లకు తన అనుభవాన్ని పంచుతూ 'సంజు' విషయంలో స్క్రిప్ట్ లో మార్పు చేర్పులు జరిగిన విషయం నిజమేనని ఒప్పుకున్నాడు.  మొదట్లో అన్నీ నిజాలే చూపించాడట.  ఉన్నది ఉన్నట్టే సినిమా తీశానని.. ఆ వెర్షన్ చూసిన వాళ్ళకెవరికీ నచ్చలేదని దాంతో హీరో క్యారెక్టర్ ను చూసిన ఆడియన్స్ ఎంపతీ( సానుభూతి.. ఒక రకంగా ఆర్ద్రత అని కూడా అనుకోవచ్చు) కలగదు  అని భావించి కొన్ని సింపతీ కలిగేలా కొత్త సీన్స్ ను జోడించడం జరిగిందని చెప్పాడు. ఆ ప్రాసెస్ లో కొన్ని ఆల్రెడీ చిత్రీకరించిన సీన్స్ ను ఎడిటింగ్ కూడా చేయాల్సి వచ్చిందట. ఏదేమైనా  హీరాని మాత్రం సంజు బాబా మనసు మంచిదని కితాబివ్వడం కొసమెరుపు.

'సంజు' షుగర్ కోటింగ్ విషయాన్నీ హీరాని ఓపెన్ గా అంగీకరించడంతో ఇప్పటివరకూ సినిమాపై వచ్చిన విమర్శలు నిజమని నమ్మక తప్పదు.
Tags:    
  • Rajkumar Hirani 
  • Sanju script 
  • Sanjay Dutt 

Similar News

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS